News February 4, 2025
WNP: మరో రెండు రోజులే మిగిలింది..!

తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు గడువు మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఫిబ్రవరి 1న చివరి తేది ఉండగా.. ప్రభుత్వం దరఖాస్తు చివరి తేదీని ఫిబ్రవరి 6 వరకు పొడిగించింది. ఇంకా ఎవరైనా దరఖాస్తు చేయనట్లయితే చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంబంధిత శాఖ నాగర్‌కర్నూల్ జిల్లా అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News January 22, 2026
సూర్యాపేట: ఊరికో సైదులు.. మీ ఊర్లో ఉన్నారా..!

సూర్యాపేట జిల్లా పాలకీడు జాన్ పహాడ్ సైదన్న దర్గా మతసామరస్యానికి ప్రతీతి. ఇక్కడికి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్దఎత్తున భక్తులు వస్తుంటారు. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ఉర్సు జరగనుంది. అయితే తమ కోరికలు తీరిన వారు భక్తితో కులమతాలకతీతంగా సైదన్న పేరును పెట్టుకుంటారు. జిల్లాలోని చాలా గ్రామాల్లో కనీసం ఇద్దరు, ముగ్గురికి తగ్గకుండా ‘సైదులు’ అనే పేరున్న వారు ఉంటారు. మరి మీ గ్రామంలోనూ ఉన్నారా..!
News January 22, 2026
భర్తను చంపి.. రాత్రంతా పోర్న్ వీడియోలు చూస్తూ..

AP: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది ఓ మహిళ. డెడ్‌బాడీ పక్కన కూర్చొని రాత్రంతా పోర్న్ వీడియోలు చూసింది. గుంటూరు దుగ్గిరాల (M)కు చెందిన శివనాగరాజుకి భార్య లక్ష్మీమాధురి బిర్యానీలో 20 నిద్రమాత్రల పొడి కలిపి పెట్టింది. భర్త స్పృహ కోల్పోయాక ప్రియుడు గోపితో కలిసి దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. గుండెపోటుతో మరణించాడని నమ్మబలికింది. చెవిలో రక్తం కనిపించడంతో పోలీసులు అసలు విషయం బయటకు లాగారు.
News January 22, 2026
MBNR: మోడల్ స్కూళ్లలో అడ్మిషన్లకు దరఖాస్తులు

తెలంగాణ మోడల్ స్కూల్లో వచ్చే విద్యా సంవత్సరం గాను 6వ తరగతి ప్రవేశాలతో పాటు 7-10తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. జనవరి 28 నుంచి Feb 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఏప్రిల్ 19న ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఆరో తరగతిలో 100 మంది విద్యార్థులను తీసుకుంటారు. ఉమ్మడి పాలమూరులో కోడేర్, వెల్దండ, కొత్తకోట, ఘనపూర్, పెబ్బేర్, గండీడ్, ధన్వాడ, కోస్గిలో మోడల్ స్కూల్‌లు ఉన్నాయి. SHARE IT


