News February 6, 2025
WNP: మహిళలు, బాలికల భద్రతకు భరోసా కేంద్రం పెద్దపీట: ఎస్పీ

మహిళల, బాలికల భద్రతకు భరోసా కేంద్రం పెద్దపీట వేస్తుందని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రం ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ఎస్పీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. భరోసా కేంద్రం ద్వారా మహిళలకు రక్షణ కల్పించడంతోపాటు వారికి అవసరమైన న్యాయం కల్పించడం జరుగుతుందని తెలిపారు.
Similar News
News December 5, 2025
నల్గొండ: కబడ్డీ అసోసియేషన్‌లో లుకలుకలు!

నల్గొండ జిల్లా కబడ్డీ అసోసియేషన్‌లో లుకలుకలు బయటపడ్డాయి. కబడ్డీ అసోసియేషన్‌లో ఆంధ్రా ప్రాంత ఉద్యోగి పెత్తనం చెలాయించడంపై అసోసియేషన్ మండిపడుతోంది. జిల్లా కమిటీ సభ్యులకు తెలియకుండానే జిల్లా కబడ్డీ అసోసియేషన్ పేరుతో ఈనెల 2, 3, 4వ తేదీల్లో హాలియాలో 51వ అంతర్ జిల్లాల బాలికల కబడ్డీ పోటీలు నిర్వహించారు. హాలియాలో నిర్వహించిన కబడ్డీ పోటీలకు కబడ్డీ అసోసియేషన్‌తో సంబంధం లేదని సభ్యులు తెలిపారు.
News December 5, 2025
షమీని ఎందుకు ఆడించట్లేదు: హర్భజన్

డొమెస్టిక్ క్రికెట్లో రాణిస్తున్నా షమీని జాతీయ జట్టులోకి ఎందుకు తీసుకోవట్లేదని సెలక్టర్లను మాజీ క్రికెటర్ హర్భజన్ ప్రశ్నించారు. మంచి బౌలర్లను సైడ్‌లైన్ చేసేస్తున్నారని అన్నారు. ‘ప్రసిద్ధ్ మంచి బౌలరే కానీ అతడు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వైట్‌బాల్ క్రికెట్లో మ్యాచులు గెలిపించే బౌలర్లు ప్రస్తుత టీమ్‌లో లేరు’ అని పేర్కొన్నారు. నిన్న SMATలో సర్వీసెస్‌తో జరిగిన మ్యాచులో షమీ 4 వికెట్లు పడగొట్టారు.
News December 5, 2025
ఉమ్మడి కరీంనగర్.. నామినేషన్లకు నేడే LAST

ఉమ్మడి కరీంనగర్లో మూడో విడతలో 433 GPలకు, 3924 వార్డ్ మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటివరకు జగిత్యాలలో సర్పంచ్‌కి 352, వార్డు సభ్యులకు 1148, KNRలో సర్పంచ్‌కి 325, వార్డు సభ్యులకు 991, పెద్దపల్లిలో సర్పంచ్‌కి 242, వార్డు సభ్యులకు 927, సిరిసిల్ల జిల్లా సర్పంచులకు 317, వార్డు సభ్యులకు 896 చొప్పున నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. కాగా నామినేషన్లు ఇవాళ సా.5గం.ల వరకు స్వీకరిస్తారు.


