News February 6, 2025

WNP: మహిళలు, బాలికల భద్రతకు భరోసా కేంద్రం పెద్దపీట: ఎస్పీ

image

మహిళల, బాలికల భద్రతకు భరోసా కేంద్రం పెద్దపీట వేస్తుందని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రం ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ఎస్పీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. భరోసా కేంద్రం ద్వారా మహిళలకు రక్షణ కల్పించడంతోపాటు వారికి అవసరమైన న్యాయం కల్పించడం జరుగుతుందని తెలిపారు.

Similar News

News January 21, 2026

మే నెలలో సముద్రంలోకి మత్స్య-6000

image

సముద్ర గర్భ రహస్యాల అన్వేషణలో భారత్ కీలక అడుగు వేయబోతుంది. ‘సముద్రయాన్’ ప్రాజెక్టులో భాగంగా చెన్నై NIOT కేంద్రంలో తయారైన నాలుగో తరం సబ్‌మెరైన్ ‘మత్స్య-6000’ను మే నెలలో సముద్రంలోకి ప్రవేశపెట్టనున్నారు. డీప్ ఓషియన్ మిషన్ (DOM) కింద రూపొందిన ఈ సబ్‌మెరైన్‌లో 500 మీటర్ల లోతు వరకు ముగ్గురు ఆక్వానాట్స్ ప్రయాణిస్తారు. ఈ ప్రయోగం విజయవంతమైతే US, రష్యా, చైనా, ఫ్రాన్స్, జపాన్ సరసన భారత్ నిలుస్తుంది.

News January 21, 2026

PDPL: మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రవేశాల పోస్టర్ ఆవిష్కరణ

image

అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ దాసరి వేణు మంగళవారం సమీకృత కలెక్టరేట్లో మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల పోస్టర్ ను ఆవిష్కరించారు. జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి పి నరేష్ కుమార్, తహసీల్దార్ రాజ్ కుమార్, రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ సన ఫక్రుద్దీన్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

News January 21, 2026

TTD జేఈవోగా శరత్ నియామకం

image

TTD జేఈవో(హెల్త్ అండ్ ఎడ్యుకేషన్)గా డాక్టర్ ఏ.శరత్ నియామకమయ్యారు. 2005 బ్యాచ్‌కు చెందిన ఆయన రిటైర్మెంట్ అయిన తరువాత ప్రభుత్వం రీ-ఎంప్లాయిమెంట్ కల్పించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏడాది పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.