News March 25, 2025
WNP: మిల్లులపై కేసులు బుక్ చేయండి: కలెక్టర్

గత సీజన్లో ధాన్యం తీసుకొని ఇప్పటివరకు CMR ఇవ్వని రైస్ మిల్లులపై కేసులు నమోదుచేసి, RR యాక్ట్ కింద చర్యలుచేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. కలెక్టరేట్ లో పౌరసరఫరాల అధికారులతో కలెక్టర్ సమీక్షనిర్వహించారు. 2024-25 వానాకాలానికి సంబంధించి 100% CMR ధాన్యం అప్పగించిన మిల్లర్లకు మాత్రమే తదుపరి సీజన్ ధాన్యం కేటాయించాలని కలెక్టర్ సూచించారు. రబిసీజన్ వరిధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలన్నారు.
Similar News
News April 1, 2025
పాఠశాలలు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: DEO

ఒంటిపూట బడులకు భిన్నంగా తరగతులు నిర్వహిస్తే చర్యలు తప్పవని గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి C.V రేణుక ఒక ప్రకటనలో హెచ్చరించారు. మార్చి 15 నుండి ప్రభుత్వం ఒంటిపూట బడులు ప్రకటించినా కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాలు వాటిని పాటించడం లేదని డీఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 7.45 నుండి మధ్యాహ్నం 12.30 ని.ల వరకు మాత్రమే పాఠశాలలు నిర్వహించాలని స్పష్టం చేశారు.
News April 1, 2025
TTD పనితీరు అస్తవ్యస్తం.. చర్యలు తీసుకోండి: PMకు ఎంపీ లేఖ

AP: తిరుమలలో భద్రతా వైఫల్యాలపై జోక్యం చేసుకోవాలంటూ PM మోదీ, హోంమంత్రి అమిత్‌షాకు YCP MP గురుమూర్తి లేఖ రాశారు. ‘వైకుంఠ ఏకాదశి రోజు తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయారు. అన్నదానం క్యూకాంప్లెక్స్‌లోనూ తొక్కిసలాట జరిగింది. కొండపైకి మాంసం, మద్యం తీసుకెళ్తున్నారు. పాపవినాశనం డ్యామ్‌లో నిబంధనలకు విరుద్ధంగా బోట్లు తిప్పారు. TTD పనితీరు అస్తవ్యస్తంగా మారింది. ఈ ఘటనలపై చర్యలు తీసుకోండి’ అని కోరారు.
News April 1, 2025
నాగర్‌కర్నూల్: ఊర్కొండపేట ఘటనపై మంత్రి సీతక్క ఆగ్రహం

నాగర్ కర్నూల్ జిల్లాలోని ఉర్కొండపేటలో మహిళపై జరిగిన అత్యాచార ఘటనపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, మహిళా సంక్షేమ అధికారులతో సీతక్క మాట్లాడి.. కేసు పురోగతి వివరాలు, బాధితురాలి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. బాధితురాలికి అన్ని రకాల సహాయం అందించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.