News January 28, 2025
WNP: మీ పిల్లలు ఏ కళాశాలలో ఎక్కడ చదువుతున్నారు..?

ఉమ్మడి జిల్లాలో ఇంటర్ విద్యా శాఖలో పనిచేసే సిబ్బంది పిల్లలు ఇంటర్మీడియట్ ఎక్కడ చదువుతున్నారు అనే వివరాలను ఇంటర్ బోర్డ్ సేకరిస్తుంది. ఎక్కడ ఏ కళాశాలలో చదువుతున్నారు అనే సమాచారాన్ని పంపించాల్సిందిగా అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయని జిల్లా ఇంటర్ కార్యాలయం సిబ్బంది పేర్కొన్నారు. మార్చి 5 నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు జరగనున్న నేపథ్యంలో సమాచారం సేకరిస్తున్నట్టుగా అధికారులు తెలిపారు.
Similar News
News February 26, 2026
జనగామ: ‘ఆర్టీసీ సేవల్లో సమస్యలా.. రేపు ఫోన్ చేయండి’

ఆర్టీసీ బస్సు సర్వీసులపై సమస్యలు, సూచనలు స్వీకరించేందుకు శుక్రవారం జనగామ డిపోలో “డయల్ యువర్ డీఎం” కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీఎం ఎస్. స్వాతి తెలిపారు. ఉదయం 11 నుంచి 12 గంటల వరకు 9959226050 నంబర్‌కు ఫోన్ చేసి బచ్చన్నపేట, పాలకుర్తి సహా పలు మండలాల ప్రజలు తమ ఫిర్యాదులు తెలియజేయవచ్చు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు.
News February 26, 2026
GNT: గురుకుల్లాల్లో ప్రవేశాలు.. పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

AP గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా గురువారం కలెక్టరేట్‌లో పోస్టర్‌ను విడుదల చేశారు. 5వ తరగతిలో ప్రవేశానికి, 6,7, 8 తరగతులలో మిగిలి ఉన్న సీట్లలో ప్రవేశానికి, ఇంటర్మీడియట్, డిగ్రీలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. మార్చి 31 వరకు ఆన్లైన్‌లో దరఖాస్తులు చేయవచ్చన్నారు.
News February 26, 2026
ఏలూరు: ఇంటర్ ఇంగ్లీష్ పరీక్షకు 385 మంది గైర్హాజరు

ఏలూరు జిల్లాలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఆర్ఐవో యోహాన్ తెలిపారు. గురువారం జరిగిన ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 15,972 హాజరయ్యారని చెప్పారు. 385 మంది వివిధ కారణాలతో గైర్హాజరు అయ్యారని వివరించారు. జనరల్ విద్యార్థులు 14,128, ఒకేషనల్ విద్యార్థులు 1,844 మంది పరీక్ష రాశారని వివరించారు. దీంతో పరీక్షా శాతం 98 శాతంగా నమోదు అయిందన్నారు.


