News March 19, 2025
WNP: రేపు జాబ్ మేళా.. సద్వినియోగం చేసుకోండి

వనపర్తి జిల్లాలోని నిరుద్యోగులకు వివిధ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగ భర్తీకి ఈనెల 20న జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి మహమ్మద్ జానీ పాషా తెలిపారు. మొత్తం 400 ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు సర్టిఫికెట్స్, బయోడేటా ఫామ్‌తో పట్టణంలోని రామాలయం సమీపాన ఉన్న ప్రధానమంత్రి కౌశల్ కేంద్ర (PMKK)సెంటర్‌లో హాజరు కావాలన్నారు.
Similar News
News December 1, 2025
రూ.73 లక్షలకు బంగారిగడ్డ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం!

నల్గొండ జిల్లా చండూరు మండలం బంగారిగడ్డ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. సర్పంచ్ అభ్యర్థిగా 11 మంది నామినేషన్ వేశారు. ఆ తర్వాత గ్రామంలోని కనకదుర్గ ఆలయ నిర్మాణం, గ్రామాభివృద్ధి కోసం ఏకగ్రీవం చేయాలని నిర్ణయించి వేలంపాట వేయడంతో రూ.73 లక్షలకు మహమ్మద్ సమీనా ఖాసీం అనే అభ్యర్థి దక్కించుకున్నట్లుగా తెలిసింది. ఏకగ్రీవం విషయమై అధికారుల నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
News December 1, 2025
అంకన్నగూడెం గ్రామ పంచాయతీ ఏకగ్రీవం..!

ములుగు మండలంలోని ఆదర్శ గ్రామ పంచాయతీ అంకన్నగూడెం పాలకవర్గం ఏకగ్రీవమైంది. ఈ గ్రామానికి రిజర్వేషన్ ఎస్టీ జనరల్ కేటాయించగా.. సర్పంచ్‌గా కొట్టెం రాజు, ఉప సర్పంచ్‌గా అల్లెం నాగయ్యను ఎన్నుకుంటూ గ్రామస్థులు తీర్మానించారు. ఆరుగురు వార్డు సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. <<18420628>>1972లో పంచాయతీ ఆవిర్భావం నుంచి ఏకగ్రీవం <<>>చేసుకుంటున్న గ్రామస్థులు అదే ఆనవాయితీని కొనసాగించారు. మిగతా పంచాయతీలకు ఆదర్శంగా నిలిచారు.
News December 1, 2025
పెళ్లి చేసుకున్న సమంత!

స్టార్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు పెళ్లి చేసుకున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇవాళ ఉదయం కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో వీరిద్దరి వివాహం జరిగినట్లు వెల్లడించాయి. ఈ కపుల్‌కు పలువురు సోషల్ మీడియాలో విషెస్ చెబుతున్నారు. కాగా పెళ్లికి సంబంధించి ఈ జోడీ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుందని సినీ వర్గాలు పేర్కొన్నాయి.


