News February 4, 2025

WNP: విద్యార్థిని సన్మానించిన వనపర్తి జిల్లా ఎస్పీ

image

చిన్నంబావి మండలం కొప్పునూరు గ్రామానికి చెందిన పసుల శంకర్ యాదవ్ కుమారుడు మనోహర్ బీఎ డిగ్రీ పూర్తి చేసి వనపర్తి జిల్లా కేంద్రంలో ఎస్‌డీఎం లా కాలేజీలో చదువుతూ మొదటి సంవత్సరం సెమిస్టర్‌లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లోనే మొదటి ర్యాంకు సాధించాడు. ఈ సందర్భంగా మనోహర్‌ను వనపర్తి ఎస్పీ రావుల గిరిధర్, కళాశాల అధ్యాపకులు, కొప్పునూరు గ్రామస్థులు ఘనంగా సన్మానించారు.

Similar News

News September 17, 2025

GWL: కలెక్టరేట్‌లో ప్రోటోకాల్ రగడ

image

గద్వాల కలెక్టరేట్‌లో జరిగిన ప్రజా పాలన దినోత్సవంలో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. కార్యక్రమ వేదికపైకి గద్వాల మార్కెట్ ఛైర్మన్‌ను ఆహ్వానించి, జిల్లా లైబ్రరీ ఛైర్మన్, అలంపూర్ మార్కెట్ ఛైర్మన్‌లను పిలవకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదికపైకి వెళ్లిన వారిని పోలీసులు కిందికి తీసుకువచ్చారు. అయితే, ఉన్నతాధికారుల ఆదేశాలతో వారిని తిరిగి వేదికపై కూర్చోబెట్టడంతో వివాదం సద్దుమణిగింది.

News September 17, 2025

విశాఖ: మెడికల్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

image

విశాఖలోని ఓ వైద్య కళాశాలలో చదువుతున్న విద్యార్థి బుధవారం మేడ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం చంబా జిల్లాకు చెందిన విస్మద్ సింగ్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News September 17, 2025

సూర్యాపేట-గరిడేపల్లి హైవేపై యాక్సిడెంట్

image

గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్ల మండలం ఫతేపురం గ్రామానికి చెందిన శ్రీనివాస్ టీవీఎస్‌ ఎక్సెల్‌పై ప్రయాణిస్తుండగా సూర్యాపేట-గరిడేపల్లి రహదారిపై లారీ ఢీకొంది. ఈ ఘటనలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.