News February 4, 2025

WNP: విద్యార్థిని సన్మానించిన వనపర్తి జిల్లా ఎస్పీ

image

చిన్నంబావి మండలం కొప్పునూరు గ్రామానికి చెందిన పసుల శంకర్ యాదవ్ కుమారుడు మనోహర్ బీఎ డిగ్రీ పూర్తి చేసి వనపర్తి జిల్లా కేంద్రంలో ఎస్‌డీఎం లా కాలేజీలో చదువుతూ మొదటి సంవత్సరం సెమిస్టర్‌లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లోనే మొదటి ర్యాంకు సాధించాడు. ఈ సందర్భంగా మనోహర్‌ను వనపర్తి ఎస్పీ రావుల గిరిధర్, కళాశాల అధ్యాపకులు, కొప్పునూరు గ్రామస్థులు ఘనంగా సన్మానించారు.

Similar News

News February 10, 2026

జననాయగన్ సెన్సార్ వివాదం.. CBFCపై కేసు వెనక్కి!

image

జననాయగన్ సినిమా సెన్సార్ విషయంలో CBFCపై వేసిన కేసును వెనక్కి తీసుకునేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారు. ఈ మేరకు మద్రాస్ హైకోర్టు రిజిస్ట్రీకి లేఖ సమర్పించారు. చట్టపరమైన చర్యలకు బదులు సినిమాలో మార్పులు చేసి మరోసారి రివైజింగ్ కమిటీ ముందుకు వెళ్లాలనుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. జనవరి 9నే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా సెన్సార్ ఇష్యూస్‌తో వాయిదాపడ్డ విషయం తెలిసిందే.

News February 10, 2026

ప.గో: ట్రంప్ టారిఫ్ తగ్గించినా.. ‘సిండికేట్’ వదలడం లేదు (2/3)

image

ఉమ్మడి ప.గో. జిల్లాలో 3 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. ఇటీవల ట్రంప్ ఎగుమతి సుంకాలను 18 శాతానికి తగ్గించడంతో మేలు జరుగుతుందని రైతులు భావించారు. అయితే సిండికేట్ వ్యాపారుల వల్ల రైతులకు ఫలితం దక్కడం లేదు. మేతలు, విత్తనాల ధరలు పెంచి ట్రేడర్లు లాభాలను కొల్లగొడుతున్నారు. ప్రభుత్వం ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, సిండికేట్ల దోపిడీ నుంచి విముక్తి కలిగించాలని రైతులు కోరుతున్నారు.

News February 10, 2026

హెచ్‌సీఏ అండర్‌-19 కెప్టెన్‌గా కరీంనగర్ వాసి

image

కొడిమ్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి ఎర్రోజు తక్షిల్.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అండర్-19 అంతర్ జిల్లాల వన్డే క్రికెట్ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ వేణు తెలిపారు. తక్షిల్ అంతర్ జిల్లాల వన్డే క్రికెట్ టోర్నమెంట్‌కు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కెప్టెన్‌గా వ్యవహరిస్తాడన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని అధ్యాపకులు అభినందించారు.