News February 4, 2025

WNP: విద్యార్థిని సన్మానించిన వనపర్తి జిల్లా ఎస్పీ

image

చిన్నంబావి మండలం కొప్పునూరు గ్రామానికి చెందిన పసుల శంకర్ యాదవ్ కుమారుడు మనోహర్
బీఏ డిగ్రీ పూర్తి చేసి వనపర్తి జిల్లా కేంద్రంలో ఎస్‌డీఎం లా కాలేజీలో చదువుతూ మొదటి సంవత్సరం సెమిస్టర్‌లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లోనే మొదటి ర్యాంకు సాధించాడు. ఈ సందర్భంగా మనోహర్‌ను వనపర్తి ఎస్పీ రావుల గిరిధర్, కళాశాల అధ్యాపకులు, కొప్పునూరు గ్రామస్థులు ఘనంగా సన్మానించారు.

Similar News

News February 18, 2025

ఏసీబీకి పట్టుబడ్డ మక్తల్ సీఐ, కానిస్టేబుళ్లు

image

ఏసీబీ వలలో సీఐ, కానిస్టేబుళ్లు పడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. ఒక కేసు విషయంలో మక్తల్ సీఐ చంద్రశేఖర్, కానిస్టేబుళ్లు శివారెడ్డి, నరసింహులు రూ.20వేలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మహబూబ్‌నగర్ ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ వీరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అలాగే వారి ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 18, 2025

MBNR: సైబర్ వలలో ముగ్గురు వ్యక్తులు.. రూ.1.50లక్షలు స్వాహా

image

ఓ ప్రభుత్వ ఉద్యోగి ఖాతాలో నుంచి సైబర్ నేరస్థులు నగదు కాజేసిన ఘటన MBNR జిల్లాలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. గుర్తు తెలియని వ్యక్తులు ఉద్యోగికి ఫోన్ చేసి ‘నీపై స్టేషన్‌లో కేసు నమోదైంది.. రూ.లక్ష ఇస్తే కేసు లేకుండా చేస్తాం.’ అని అనటంతో ఉద్యోగి నమ్మి రూ.90వేలు వారికి పంపించారు. తర్వాత తాను మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. మరో ఇద్దరి వ్యక్తుల నుంచి సైతం సుమారు రూ.62వేలను దోచుకున్నారు.

News February 18, 2025

అడ్డాకుల: డ్రోన్ తగిలి గాయాలపాలైన యువ రైతు.!

image

వరి పంటకు మందు స్ప్రే చేసే డ్రోన్ తగిలి ఓ రైతు గాయాలపాలైన ఘటన అడ్డాకుల మండలం రాచాల గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే రాచాల గ్రామానికి చెందిన రైతు దండు ఆంజనేయులు వరి పంట సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో పంటకు మందు స్ప్రే చేయడానికి డ్రోన్ వాడుతున్న నేపథ్యంలో ప్రమాదవశాత్తు డ్రోన్ తగిలి తలకు, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.

error: Content is protected !!