News February 2, 2025
WNP: విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలి: కలెక్టర్

విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అధికారులను ఆదేశించారు. శనివారం ఖిల్లా ఘనపురంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల,మండల పరిధిలోని తెలంగాణ మోడల్ స్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేయగా, దొడ్డు బియ్యం వండడం పట్ల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన సన్న బియ్యం మాత్రమే వడ్డించాలని అన్నారు.
Similar News
News February 8, 2025
తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్

తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌పై కేసు నమోదు చేయాలని కోరుతూ హైకోర్టులో అరవింద్ రెడ్డి అనే వ్యక్తి పిటిషన్ వేశారు. వరంగల్‌లో జరిగిన బీసీ సంఘాల సభలో రెడ్డి కులస్థులపై మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. సిద్దిపేట పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. వాదనలు ఆలకించిన ధర్మాసనం పోలీసుల వైఖరి చెప్పాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.
News February 8, 2025
ఫోక్సో కేసుల దర్యాప్తు వేగవంతం: బాపట్ల SP

ఫోక్సో కేసులను వేగవంతంగా దర్యాప్తు చేయాలని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి చెప్పారు. శుక్రవారం బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో డీపీఓలో విధులు నిర్వహించే సిబ్బందితో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. సిబ్బంది పనితీరు మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళలకు సంబంధించిన కేసులను 60 రోజుల్లోపు దర్యాప్తు పూర్తి చేయాలని అన్నారు. అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
News February 8, 2025
క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం అమలుకు రూ.2.16 కోట్లు: జేసీ

జాతీయ క్లీన్ ఎయిర్ కార్యక్రమంలో భాగంగా ఏలూరు నగరంలో వాయు కాలుష్యం నియంత్రణకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి అధికారులను ఆదేశించారు. వాయు కాలుష్య నియంత్రణ అమలుపై శుక్రవారం సమీక్షించారు. ఏలూరు నగరంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ స్థలంలో పెద్ద ఎత్తున మొక్కల నాటే కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. వాయు కాలుష్య నియంత్రణకు రూ 2.16 కోట్లు కేటాయించారన్నారు.