News February 1, 2025
WNP: వృద్ధుల సంక్షేమానికి కృషి: జిల్లా కలెక్టర్

వృద్ధుల సంక్షేమానికి అనేక చట్టాలు ఉన్నాయని, వాటిపై వృద్ధులకు అవగాహన కల్పించి, తగిన న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని ఎన్ఐసి వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సీనియర్ సిటిజన్స్ కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. సంక్షేమ చట్టం 2007 ద్వారా వృద్ధులకు న్యాయం చేస్తామని అన్నారు.
Similar News
News November 27, 2025
రిజర్వేషన్లపై హైకోర్టులో నేడే విచారణ

TG: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలును నిలిపివేయాలంటూ <<18397909>>దాఖలైన<<>> పిటిషన్పై ఇవాళ HCలో విచారణ జరగనుంది. జనాభా గణాంకాలను వెల్లడించకుండా రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 46ను సవాల్ చేస్తూ ఈ పిటిషన్ వేశారు. దీని వల్ల బీసీల్లోని కొన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని, రిజర్వేషన్ల అమలును నిలిపివేయాలని కోరారు. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ వేళ దీనిపై HC ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.
News November 27, 2025
HNK టౌన్హాల్కి శతాబ్దం.. శతవత్సరాల చారిత్రక సాక్ష్యం

వరంగల్ నగరంలో నిలిచిన హనుమకొండ టౌన్హాల్కు శతవత్సరం పూర్తైంది. 1924లో పునాదిరాయి వేసి ఏడో నిజాం చేతుల మీదుగా ప్రారంభమైన ఈ కట్టడం నేటికీ చారిత్రక ప్రతీకగా నిలుస్తోంది. ‘మహబూబ్ బాగ్’ పేరుతో 7 ఎకరాల్లో నిర్మించిన ఈ గార్డెన్కి అప్పట్లో రూ.2 లక్షలు మంజూరు చేశారు. ఒకప్పుడు చిన్న జూపార్క్గా ఉన్న ఇక్కడ.. నేరెళ్ల వేణుమాధవ్ ఆడిటోరియంతో సాంస్కృతిక కేంద్రంగా కొనసాగుతోంది.
News November 27, 2025
‘ఆసుపత్రులకు శాశ్వత రిజిస్ట్రేషన్ మంజూరు చేశాం’

జిల్లాలో ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందిచేందుకు ఆస్పత్రులపై నిరంతర పర్యవేక్షణ అవసరమని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. కలెక్టర్ ఛాంబర్లో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అమలు పురోగతిపై సమీక్షించారు. జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ వైద్యసంస్థల నమోదు, నిబంధనల అమలు, సేవల నాణ్యత, ప్రజారోగ్య పరిరక్షణ అంశాలపై విస్తృతంగా చర్చ జరిపి 46 ప్రైవేట్ ఆసుపత్రులకు శాశ్వత రిజిస్ట్రేషన్ మంజూరు చేశామన్నారు.


