News March 1, 2025

WNP: సీఎం ప్రోగ్రాంకు జిల్లా కలెక్టర్ ఆహ్వానం.!

image

రేపు వనపర్తి జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వస్తున్నారని ప్రముఖులు, ప్రజలు పాల్గొనాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆహ్వాన పత్రికను విడుదల చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో అభివృద్ధి పనుల శిలాఫలకాలను ఆవిష్కరిస్తారని అన్నారు. KDR పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ప్రజాపాలన ప్రగతి బాటలో సీఎం పాల్గొంటారని అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Similar News

News November 5, 2025

ఇంటి చిట్కాలు

image

* కార్పెట్లను శుభ్రం చేయడానికి పావుకప్పు వెనిగర్, చెంచా మొక్కజొన్న పిండి, పావు కప్పు నీరు కలపాలి. ఈ మిశ్రమాన్ని కార్పెట్ల మీద చల్లి ఐదు నిమిషాలు ఉంచాలి. తర్వాత వాక్యూమ్ క్లీనర్తో శుభ్రం చేస్తే సరిపోతుంది.
* చెంచా కాఫీపొడి, గుప్పెడు పుదీనా ఆకులు, చెంచా బేకింగ్ సోడా, కాసిన్ని నిమ్మతొక్కలు, కొద్దిగా నిమ్మరసం ఒక గిన్నెలో వేసి ఒక మూలన ఉంచితే గది అంతా పరిమళం వ్యాపిస్తుంది.

News November 5, 2025

రోడ్డు ప్రమాదం.. నలుగురు TG వాసుల మృతి

image

కర్ణాటకలోని హల్లిఖేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాను, కారు ఢీకొనడంతో నలుగురు తెలంగాణ వాసులు మరణించగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను సంగారెడ్డి(D) జగన్నాథ్‌పూర్ వాసులుగా గుర్తించారు. గణగాపూర్ దత్తాత్రేయ ఆలయానికి వెళ్లి కారులో తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ‘మీర్జాగూడ’ ప్రమాదంలో 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

News November 5, 2025

SRD: ఘోర రోడ్డు ప్రమాదం.. నారాయణఖేడ్ వాసులు మృతి

image

కర్ణాటక రాష్ట్రం హోళికేడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నారాయణఖేడ్ మండలం జగన్నాథ్‌పూర్ గ్రామానికి చెందిన ముగ్గురు బుధవారం మృతి చెందారు. కర్ణాటక రాష్ట్రంలోని గానుగాపూర్ దత్తాత్రేయ స్వామి క్షేత్రాన్ని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.