News January 25, 2025
WNP: సైబర్ నేరస్థుడు అరెస్టు

అమాయక యువకులకు డబ్బు ఆశ చూపి సైబర్ నేరాల వైపు మళ్ళించిన సైబర్ నేరాల ప్రధాన సూత్రధారుడు రమేష్ నాయక్ ను వనపర్తి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు నుంచి రూ.45 లక్షల స్థిరాస్తి పత్రాలు, రూ.12.50 లక్షల కియా సోనెట్ కారు, మొబైల్ ఫోన్ జప్తు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అమాయక ప్రజలను ఇండియా బుల్స్/ధని, ముద్ర లోన్స్ పేరుతో దోచుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News October 19, 2025
పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించండి: ఎస్పీ

అనంతపురం జిల్లా ప్రజలకు, జిల్లా పోలీసు సిబ్బందికి ఎస్పీ జగదీశ్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి మీ జీవితాలలో చీకట్లను పారదోలి మరిన్ని కాంతులు నింపాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే ఈ దీపావళి పర్వదినాన ఆనవాయితీగా వచ్చే బాణసంచాను సరైన జాగ్రత్తలతో కాల్చాలని సూచించారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు.
News October 19, 2025
దీపారాధన సమయంలో చదవాల్సిన మంత్రం

దీపోజ్యోతిః పరం బ్రహ్మ, దీపః సర్వతమో పహః |
దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే ॥
దీపం జ్యోతి సాక్షాత్తూ దైవస్వరూపం. ఇది అజ్ఞానమనే చీకటిని పారద్రోలి, జ్ఞానమనే వెలుగును ఇస్తుంది. దీపం వల్లే మన కార్యాలన్నీ సుగమం అవుతాయి. అందుకే దీపాన్ని దీపలక్ష్మిగా పూజిస్తూ ‘సంధ్యా దీపమా! నీకు నమస్కారం’ అని అంటాం. ఎవరి ఇంట అయితే దీపాలెప్పుడూ వెలుగుతూ ఉంటాయో.. వారే నిజమైన ఐశ్వర్యవంతులని పెద్దలు చెబుతారు.
News October 19, 2025
వాళ్లిద్దరికీ ప్రజలే శిక్ష విధిస్తారు: మావోయిస్టులు

మావోయిస్టు అగ్రనేతలు ఇటీవల లొంగిపోవడంతో మావోయిస్టు కేంద్ర కమిటీ స్పందించింది. అభయ్ పేరుతో 4 పేజీల లేఖను విడుదల చేసింది. ‘మల్లోజుల, ఆశన్నలు విప్లవ ద్రోహులుగా మారారు. వాళ్లిద్దరికీ ప్రజలే శిక్ష విధిస్తారు. ఆయుధాలను విడిచిపెట్టడంపై మల్లోజుల వితండవాదాన్ని తెరపైకి తెచ్చారు. ఇప్పుడు ప్రాణభీతితో కొందరు లొంగిపోతుండవచ్చు. ఇది తాత్కాలిక నష్టం మాత్రమే’ అని లేఖలో పేర్కొంది.