News February 11, 2025
WNP: స్థానిక ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో: కలెక్టర్

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ల ద్వారా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు.ఎన్నికల నిర్వహణ సన్నద్ధతలో భాగంగా సోమవారం నిర్వహించిన మండలస్థాయి మాస్టర్ ట్రైనర్ లకు జిల్లాస్థాయి ట్రైనింగ్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. బ్యాలెట్ బాక్స్ తెరిచే విధానం,సీల్ వేసే విధానం తదితర అంశాలపై అవగాహన కల్పించుకోవాలన్నారు.
Similar News
News December 3, 2025
రెబెల్స్‌ను బుజ్జగించే పనిలో ప్రధాన పార్టీలు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గ్రామపంచాయతీల్లో రాజకీయాలు వేడెక్కాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత నామినేషన్ ఉపసంహరణ గడువు ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు ఉండటంతో రెబెల్స్‌ను బుజ్జగించే పనిలో ప్రధాన పార్టీల నేతలు ఉన్నారు. ‘ఈసారి తప్పుకో.. వచ్చే ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామంటూ’ ఆయా గ్రామ పంచాయతీల నాయకులు చర్చలు జరుపుతున్నారు. అలాగే రహస్య సమావేశాలు జరుపుతూ పరస్పర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
News December 3, 2025
గద్వాల: ఎన్నికల సిబ్బందికి రెండో ర్యాండమైజేషన్

గద్వాల కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల సాధారణ పరిశీలకులు గంగాధర్‌తో కలిసి కలెక్టర్ సంతోష్ సమావేశం నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు 974 పీఓలు, 1,236 ఓపీఓలు సహా మొత్తం 2,210 మంది సిబ్బందిని రెండో ర్యాండమైజేషన్ ద్వారా ఎంపిక చేసినట్లు కలెక్టర్ తెలిపారు. మండలాల వారీగా ఈ సిబ్బందిని కేటాయించినట్లు ఆయన వెల్లడించారు.
News December 3, 2025
పొగమంచులో ప్రయాణం ప్రమాదకరం: ఖమ్మం సీపీ

దట్టమైన పొగమంచు సమయాల్లో వాహన ప్రయాణం ప్రమాదకరమని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు నివారించాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. సత్తుపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారని, పొగమంచు కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల దృష్టిలో పెట్టుకొని స్వల్ప నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని పేర్కొన్నారు.


