News February 11, 2025
WNP: స్థానిక ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో: కలెక్టర్

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ల ద్వారా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు.ఎన్నికల నిర్వహణ సన్నద్ధతలో భాగంగా సోమవారం నిర్వహించిన మండలస్థాయి మాస్టర్ ట్రైనర్ లకు జిల్లాస్థాయి ట్రైనింగ్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. బ్యాలెట్ బాక్స్ తెరిచే విధానం,సీల్ వేసే విధానం తదితర అంశాలపై అవగాహన కల్పించుకోవాలన్నారు.
Similar News
News March 16, 2026
SRH కెప్టెన్‌గా అభిషేక్ శర్మ!

IPL: సన్‌రైజర్స్ జట్టుకు కొత్త కెప్టెన్ రానున్నట్లు తెలుస్తోంది. గాయం కారణంగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆరంభ మ్యాచులకు దూరం కానున్నట్లు క్రీడావర్గాలు తెలిపాయి. దీంతో ఆయన స్థానంలో ఓపెనింగ్ సెన్సేషన్ అభిషేక్ శర్మ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టనున్నట్లు అంచనా వేస్తున్నాయి. వెన్నునొప్పితో బాధపడుతున్న కమిన్స్ T20WCలో సైతం ఆడలేదు. పూర్తిగా కోలుకోవడానికి మరో 2 నుంచి 3 వారాలు పట్టే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.
News March 16, 2026
సిరిసిల్ల ప్రజావాణిలో 142 దరఖాస్తులు

కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి బాధితుల నుంచి 142 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టర్ గరిమ అగ్రవాల్ స్వయంగా అర్జీలను స్వీకరించి, వాటిని పరిశీలించారు. అత్యధికంగా రెవెన్యూ శాఖకు 56, డీఆర్డీవోకు 20, జిల్లా పంచాయతీ కార్యాలయానికి 14 దరఖాస్తులు అందాయి. గృహ నిర్మాణ శాఖకు 13, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌కు 7 దరఖాస్తులు రాగా.. నీటి పారుదల, మున్సిపల్, పౌర సరఫరాల శాఖలకు మిగిలినవి అందాయి.
News March 16, 2026
అధికారుల చేతుల్లోకి మున్సిపాలిటీలు.. బుధవారం నుంచి స్పెషల్ ఆఫీసర్ల రాక

జిల్లాలోని పిఠాపురం, తుని, పెద్దాపురం, సామర్లకోట మున్సిపాలిటీలతో పాటు గొల్లప్రోలు, ఏలేశ్వరం నగర పంచాయతీల కాలపరిమితి మంగళవారం సాయంత్రంతో ముగియనుంది. దీంతో బుధవారం నుంచి ఈ స్థానాల్లో ప్రత్యేక అధికారులు బాధ్యతలు స్వీకరించనున్నారు. తిరిగి ఎన్నికలు జరిగే వరకు లేదా గరిష్ఠంగా ఆరు నెలల పాటు అధికారుల పాలనలోనే పురపాలన కొనసాగుతుంది. పదవీకాలం పూర్తి చేసుకున్న ప్రజాప్రతినిధులంతా ఇకపై ‘మాజీలు’గా మారనున్నారు.


