News March 13, 2025

WNP: హోలీ పండగపై ఎస్పీ కీలక ప్రకటన.!

image

వనపర్తి జిల్లా ప్రజలు హోలీ పండగను సంప్రదాయ పద్ధతుల్లో ప్రకృతిలో లభించే, చర్మానికి, పర్యావరణానికి హాని కలిగించని న్యాచురల్ కలర్స్‌ను వినియోగించి, ప్రశాంత వాతావరణంలో, ఆనందోత్సాహాలతో చేసుకోవాలని జిల్లా ఎస్పీ గిరిధర్ అన్నారు. జిల్లా ప్రజలు, యువత మద్యం సేవించి వాహనాలను నడపడం, బహిరంగ ప్రదేశాలపై, ఇష్టం లేని వ్యక్తులపై, వాహనాలపై రంగులు, రంగు నీళ్లు చల్లకూడదు అన్నారు.

Similar News

News November 21, 2025

KNR: మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా పర్యటన రద్దు

image

నేడు కరీంనగర్‌లో జరగాల్సిన మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన వాయిదా పడింది. హైదరాబాదులో రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ప్రోగ్రాం వాయిదా పడ్డట్లు మంత్రి కార్యాలయం తెలిపింది. LMD వద్ద నిర్వహించనున్న చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహిస్తారని, కొత్తపల్లి మండలంలో నిర్వహించే మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. దీనిని మరోరోజు నిర్వహించనున్నారు.

News November 21, 2025

KNR: TGNPDCL డిజిటల్ సేవలు..!

image

మెరుగైన సేవలకు TGNPDCL యాప్ తీసుకొచ్చింది. దీంతో న్యూకనెక్షన్, సెల్ఫ్ రీడింగ్, పేబిల్స్, బిల్స్ హిస్టరీ, లోడ్ ఛేంజ్, కంప్లైంట్ స్టేటస్ వంటి 20రకాల డిజిటల్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ చాట్‌బాట్ ద్వారా కూడా కరెంట్ సమస్యలు పరిష్కరించుకోవచ్చు. అప్లికేషన్ నమోదు నుంచి సర్వీస్ రిలీజ్ వరకు సేవలు పొందొచ్చు. ప్లేస్టోర్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని విద్యుత్ సేవలు ఆస్వాదించాలని అధికారులు కోరుతున్నారు.

News November 21, 2025

NZB: హమారా ‘నిఖత్’ హ్యాట్రిక్ విన్నర్

image

గ్రేటర్ నోయిడాలో గురువారం జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో నిజామాబాద్‌కు చెందిన నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధించింది. నిఖత్ 51 కేజీల విభాగంలో తైవాన్ క్రీడాకారిణిపై 5-0తో గెలిచింది. దీంతో వరుసగా 3 ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లలో గోల్డ్ మెడల్ సాధించింది. 2022, 2023, 2025 సంవత్సరాల్లో జరిగిన టోర్నీల్లో బంగారు పతకం గెలుపొందింది. 2024లో ఒలింపిక్ క్రీడల వల్ల ఎలాంటి టోర్నీలు జరగ లేదు.