News June 29, 2024
WNP: అక్రిడిటేషన్ జర్నలిస్ట్ పిల్లల్లో ఒకరికి ప్రైవేటు బడుల్లో ఉచిత విద్య

వనపర్తి జిల్లాలో ప్రతి అక్రిడిటేషన్ జర్నలిస్ట్ ఇద్దరు పిల్లల్లో ఒకరికి ఉచిత విద్య, మరొకరికి 50% ఫీజు రాయితీతో విద్యను బోధించాలని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు డీఈఓ సర్క్యులర్ జారీ చేశారు. అమలుకు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా మండల విద్యాధికారులను ఆదేశించారు. TUWJH -143 యూనియన్ జిల్లా కమిటీ రిప్రజెంటేషన్ మేరకు ఈ సర్క్యులర్ విడుదల చేశామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Similar News
News September 16, 2025
MBNR: విద్యుత్ స్తంభం ఇలాగే ఉండాలా..?

మహబూబ్‌నగర్‌లోని శ్రీనివాస కాలనీలో ఓ ఇంటి ప్రహరీ గోడలో విద్యుత్ స్తంభం దర్శనమిస్తుంది. రెండు నెలల క్రితం ప్రచార మాధ్యమాలలో విషయం వైరల్ కావడంతో స్పందించిన మున్సిపల్ కమిషనర్ తొలగిస్తామని హామీ ఇచ్చారు. నేటికీ అది అలాగే ఉండడంతో స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రహదారి పక్కన ఉండాల్సిన విద్యుత్ స్తంభం ఇంటి ప్రహరీ గోడలోనే ఉండాలా..? అని ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు.
News September 15, 2025
MBNR: భరోసా కేంద్రాన్ని సందర్శించిన ఎస్పీ

ఎస్పీ డి.జానకి సోమవారం మహబూబ్‌నగర్‌లోని భరోసా కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె షీ టీమ్, ఏహెచ్‌టీయూ, కళాబృందం, భరోసా కేంద్రం సభ్యులతో సమావేశం నిర్వహించారు. మహిళలు, విద్యార్థినులకు వేధింపులు జరగకుండా కృషి చేయాలని, పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు మూఢ నమ్మకాలపై అవగాహన కల్పించాలని ఆమె సూచించారు.
News September 15, 2025
MBNR: ప్రజావాణికి 15 ఫిర్యాదులు: ఎస్పీ

మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ డి.జానకి ప్రజల నుంచి 15 వినతిపత్రాలను స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును శ్రద్ధగా పరిశీలించిన ఎస్పీ, సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజావాణి ద్వారా వచ్చిన ప్రతి సమస్యపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని ఎస్పీ తెలిపారు.