News February 14, 2026

WNP: ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్ ఉన్న పత్రికలకు అక్రెడిటేషన్లు ఇవ్వాలి

image

కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆర్ఎన్ఐ, పీఆర్ జీఐ రిజిస్ట్రేషన్ ఉన్న అన్ని పత్రికలకు ఎంప్యానల్‌మెంట్‌తో సంబంధం లేకుండా అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17న ఛలో సమాచార భవన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు అంబటి స్వామి తెలిపారు. హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్ లో సమాచారభవన్ ఎదుట జరిగే కార్యక్రమానికి జర్నలిస్టులు రావాలన్నారు.

Similar News

News February 22, 2026

నాగర్ కర్నూల్ జిల్లా.. ఇంటర్ పరీక్షలకు వేళాయె!

image

నాగర్ కర్నూల్ జిల్లాలో ఈ నెల 25 నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటరమణ తెలిపారు.
✒ఇంటర్మీడియట్ విద్యార్థుల సంఖ్య: 15,173
✒ మొత్తం పరీక్ష కేంద్రాలు: 34
✒ఇన్విజిలేటర్లు: 300
✒అన్ని కేంద్రాల్లో CC కెమెరాల నిఘా
✒హాల్ టికెట్లలో QR కోడ్ స్కాన్ చేస్తే ఎగ్జామ్ సెంటర్ వివరాలు వస్తాయి
✒సిట్టింగ్ స్క్వాడ్లు: 3
✒చీఫ్ సూపరింటెండెంట్స్- 34
✒కస్టోడియన్స్- 6
✒మెడికల్ ANMలు- 34

News February 22, 2026

పెద్దవాళ్ల సబ్బునే పిల్లలకూ వాడుతున్నారా?

image

చిన్నపిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. అందుకే వారికి ఉపయోగించే ఉత్పత్తుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. చాలామంది పిల్లలకు తర్వాత పెద్దవాళ్ల సబ్బులే వాడుతుంటారు. కానీ ఇది సరికాదంటున్నారు నిపుణులు. దీనివల్ల వారికి చిరాకు, అలర్జీ వచ్చే అవకాశముందంటున్నారు. పిల్లల ఉత్పత్తుల్లో పారబెన్స్‌, మినరల్‌ ఆయిల్స్‌, సల్ఫేట్స్‌ లేకుండా pH5.5% ఉండేలా చూసుకోవాలంటున్నారు.

News February 22, 2026

NIT దుర్గాపూర్‌లో ఉద్యోగాలు

image

NIT దుర్గాపూర్ 3 ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్(2), రీసెర్చ్ అసిస్టెంట్(1) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు మార్చి 7 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి పీజీ(సోషల్ సైన్స్), NET/M.Phil/PhD అర్హత ఉండాలి. రీసెర్చ్ అసిస్టెంట్‌కు నెలకు రూ.37,000, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్‌కు రూ.20,000 చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://nitdgp.ac.in