News April 4, 2025
WNP: ఇండియన్ ఆర్మీలో నియామకాల కోసం దరఖాస్తులు

ఇండియన్ ఆర్మీలో నియామకం కోసం ఔత్సాహిక అభ్యర్థులు ఏప్రిల్ 10వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి మహమ్మద్ జానీ పాషా తెలిపారు. ఇండియన్ ఆర్మీలో వివిధ కేటగిరీల వారిగా అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్(క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్), ట్రేడ్స్మెన్ పదో తరగతి పాస్, అగ్నివీర్ ట్రేడ్స్ మెన్ (ఎనిమిదో తరగతి పాస్) ఉత్తీర్ణత ఉండాలన్నారు. #SHARE IT.
Similar News
News April 4, 2025
వరంగల్‌కు పుష్-పుల్ ట్రైన్ నడపండి.. ఎంపీ కావ్య విజ్ఞప్తి

ఉదయం వేళ వరంగల్ నుంచి హైదరాబాద్‌కు పుష్-పుల్ రైలు నడపాలని శుక్రవారం వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కోరారు. ఈమేరకు పార్లమెంట్‌లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆమె మాట్లాడుతూ.. పేద మధ్యతరగతి ప్రజలు రోజువారీ పనుల నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్తుంటారని, వారికి సౌకర్యార్థంగా రైళ్లను నడపాలని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ తెలిపారు.
News April 4, 2025
AI వినియోగం.. భవిష్యత్‌పై బిల్‌గేట్స్ జోస్యం!

ఏఐ రాక నేపథ్యంలో భవిష్యత్తులో ఉద్యోగాలెలా ఉంటాయన్నదానిపై బిల్ గేట్స్ పలు ఇంటర్వ్యూలో జోస్యం చెప్పారు. అవి:
* వారానికి రెండు రోజులే పని ఉంటుంది. మిగిలిన రోజుల్లో ఏఐ పనిచేస్తుంది.
* దాదాపు ఉద్యోగాలన్నీ ఏఐ చేతిలోకి వెళ్లిపోతాయి.
* ఏఐ వలన అన్ని రంగాల్లో మేథ అందరికీ ఉచితంగా లభిస్తుంది.
* కోడింగ్, బయాలజీ, ఇంధన రంగాల్లోకి మాత్రం ఏఐ రాలేదు.
News April 4, 2025
సిరిసిల్ల: ‘ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను పరిష్కరించాలి’

వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను ఈ నెల 30లోగా పరిష్కరించాలనితెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. ఉద్యోగ నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ తప్పనిసరిగా పాటించాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేశ్ బి గితే జిల్లా అధికారులతో ల్యాండ్, ప్రభుత్వ సేవలు, అట్రాసిటీ తదితర అంశాలపై చర్చించారు.