News September 11, 2025
WNP: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయండి

ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇంకా నిర్మాణాలు మొదలు పెట్టని లబ్ధిదారులతో గ్రౌండింగ్ చేయించే ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో ఇందిరమ్మ ఇండ్లపై కలెక్టర్ అదనపు కలెక్టర్ యాదయ్యతో కలిసి ఎంపీడీవోలతో వెబ్ ఎక్స్ సమావేశం నిర్వహించారు. వార్డ్ ఆఫీసర్లతో లబ్ధిదారులందరినీ పిలిపించి గ్రౌండ్ చేసుకునే విధంగా వారికి అవగాహన కల్పించాలన్నారు.
Similar News
News September 11, 2025
MHBD జిల్లాలో 27,347 టన్నుల యూరియా సరఫరా: డీఏఓ

మహబూబాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 27,347 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు సరఫరా చేశామని జిల్లా వ్యవసాయాధికారి (డీఏఓ) ఎం.విజయనిర్మల తెలిపారు. జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్‌లో 4.20 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే 3.70 లక్షల ఎకరాల్లో సాగు పూర్తయిందని ఆమె వివరించారు.
News September 11, 2025
కరీంనగర్: తల్లికి 3 నెలల డబ్బులు చెల్లించాలని ఆదేశం

శంకరపట్నం మండలం మొలంగూర్ వాసి మరాఠీ రాజమ్మ తన కుమారుడు పట్టించుకోవడంలేదని డిసెంబర్ 2024లో ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. దీంతో నెలకు రూ.6 వేలు డబ్బులు చెల్లించాలని ఆదేశించారు. గురువారం డీవీసీ కౌన్సిలర్ పద్మావతి, DHEW కవిత విచారణలో 3 నెలలుగా డబ్బులు ఇవ్వడం లేదని రాజమ్మ తెలపగా తల్లి ఖాతాలో వెంటనే డబ్బులు జమ చేయాలని కుమారుడిని అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ సమ్మయ్య, పోలీసులు ఉన్నారు.
News September 11, 2025
బ్రహ్మోత్సవాలకు సమష్టిగా పనిచేయాలి: TTD ఈవో

శ్రీవారి బ్రహ్మోత్సవాలను కన్నులపండువగా నిర్వహించేందుకు అధికారులు సమష్టిగా పని చేయాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 24 నుంచి జరగునున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలపై గురువారం అన్నమయ్య భవన్‌లో శాఖల వారీగా ఆయన సమీక్షించారు. పారిశుద్ధ్యానికి పెద్ద పీట వేస్తున్నట్లు వెల్లడించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పక్కాగా ఉండాలని కోరారు.