News January 24, 2025

WNP: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.175 కోట్ల నిధులు: మంత్రి

image

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కేవలం వనపర్తి జిల్లాకే రూ.175 కోట్ల నిధులు కేటాయించామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సల్కలాపూర్ గ్రామంలో ఆయన మాట్లాడుతూ.. అనవసరంగా ఖర్చులు చేసి అప్పుల పాలు కావద్దని, పౌష్టికాహారం, తగిన వ్యాయామం చేసుకోవడం వల్ల ఆరోగ్యవంతంగా ఉండొచ్చన్నారు. పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో కాకుండా నాణ్యమైన బోధనలు అందించే ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని సూచించారు.

Similar News

News January 1, 2026

40’s తర్వాత నిద్ర తగ్గితే ఏం జరుగుతుందో తెలుసా?

image

40 ఏళ్ల తర్వాత శరీరానికి 7-9 గంటల నిద్ర అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. 7గంటల కంటే తక్కువ సమయం నిద్రపోతే టైప్-2 డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. మెదడు ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది. రోగనిరోధక శక్తి తగ్గుదలతోపాటు రోజువారీ కార్యకలాపాలకు బాడీ నెమ్మదిగా స్పందిస్తుంది. విటమిన్ డెఫిషియన్సీ, ప్రీ డయాబెటిస్, థైరాయిడ్, హార్మోన్ల అసమతుల్యత సమస్యలు వచ్చే ప్రమాదముంది.

News January 1, 2026

IASలతో CM రేవంత్ సెలబ్రేషన్స్

image

TG: బేగంపేటలోని IAS ఆఫీసర్స్ అసోసియేషన్ క్లబ్‌లో నిర్వహించిన న్యూఇయర్ వేడుకల్లో CM రేవంత్ పాల్గొన్నారు. IASలు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రజలకు CM రేవంత్ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ రైజింగ్ విజన్​ 2047 లక్ష్య సాధన దిశగా ఈ ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం మరింత ముందుకు సాగుతుంది. అందరి ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రాధాన్యమిస్తాం’ అని తెలిపారు.

News January 1, 2026

పండుగలా పాస్‌ పుస్తకాల పంపిణీ చేపట్టాలి: జేసీ

image

జిల్లాలో రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్‌ పుస్తకాల పంపిణీని పండుగ వాతావరణంలో చేపట్టాలని జేసీ టి.రాహుల్‌ కుమార్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం భీమవరంలో ఆర్డీవోలు, తహశీల్దార్లతో నిర్వహించిన గూగుల్‌ మీట్‌లో ఆయన మాట్లాడారు. జనవరి 2 నుంచి 9 వరకు ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని, రెవెన్యూ క్లినిక్‌ల పనితీరుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.