News April 23, 2025
WNP: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక: కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మే 5వ తేదీ లోపు లబ్ధిదారుల తుది జాబితా సిద్ధం చేయాలని అధికారులకు వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లకు జిల్లాలో ఇసుక ఉచితంగా ఇస్తామన్నారు. ఎల్ఆర్ఎస్ నిర్ణీత గడువులోగా పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News April 23, 2025
ఉగ్రదాడి అనంతరం సరిహద్దుకు పాక్ విమానాలు?

పహల్గామ్‌లో ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌లోని కరాచి నుంచి రెండు ఎయిర్ ఫోర్స్ సరఫరా విమానాలు ఉత్తర సరిహద్దుకు చేరుకున్నాయని Xలో పోస్టుల వైరలవుతున్నాయి. వాటికి సంబంధించిన స్క్రీన్‌షాట్లను షేర్ చేసింది. వీటిలో మిలిటరీ సామగ్రి తరలించి ఉండవచ్చని అనుమానం వ్యక్తం అవుతోంది. ఈ సరిహద్దు జమ్ముాకశ్మీర్‌కు సమీపాన ఉంటుంది. అయితే ఈ విషయంపై ఎటువంటి అధికారిక ధ్రువీకరణ లేదు.
News April 23, 2025
ఆదోని మార్కెట్‌లో మళ్లీ పెరిగిన పత్తి ధరలు.!

కర్నూలు జిల్లాలో ఆదోని మార్కెట్‌లో పత్తి ధర నిన్నటితో పోలీస్తే క్వింటాకు రూ.150 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో దూది గింజల ధర స్వల్పంగా పెరగడం, పత్తి జిన్నింగ్ ప్రెస్సింగ్ పరిశ్రమల ఉత్పత్తికి అవసరమైన పత్తి మార్కెట్‌కి రాకపోవడంతో ధరలు పెరిగాయి. ఆదోని మార్కెట్‌లో మంగళవారం పత్తి క్వింటాల్ ధర గరిష్ఠంగా రూ.8,254 గా ఉంది. కనిష్ఠ ధర రూ.5,209 ఉండగా, మధ్యస్థ ధర రూ.7,639కి పెరిగింది.
News April 23, 2025
వరంగల్: గ్రేట్.. ఒకే ఏడాదిలో 11 మందికి ఆర్మీలో జాబ్స్

వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్‌లోని గిరిజన సంక్షేమ సైనిక్ స్కూల్ నుంచి ఒకే ఏడాదిలో 11 మంది అగ్నివీర్‌లో ఉద్యోగాలు సాధించారు. గత నెలలో ఇదే పాఠశాలకు చెందిన 8 మందికి జాబ్స్ వచ్చాయి. రెండు రోజుల క్రితం విడుదలైన రెండో విడత ఫలితాల్లో మరో ముగ్గురికి కేంద్ర ప్రభుత్వ కొలువులు వచ్చాయి. ఉపాధ్యాయుల అంకితభావంతోనే ఈ ఫలితాలు సాధించినట్లు ప్రిన్సిపల్ సురేందర్ తెలిపారు.