News February 23, 2025
WNP: ఇసుక అక్రమ రవాణా చేస్తే చర్యలు: కలెక్టర్

ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు. జిల్లాలో 12 ఇసుక రీచ్‌లు ఉన్నాయని అన్నారు. జిల్లాలో ఇసుక అవసరం ఉన్న వారు మన ఇసుక వాహనం ద్వారానే తీసుకోవాలని దళారులను ఎవరూ ఆశ్రయించొద్దని సూచించారు. ఇసుకకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే ఐడీఓసీలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం 08545-233525కు కాల్ చేసి తెలపాలని అన్నారు.
Similar News
News February 24, 2025
జగిత్యాల జిల్లాలో నేటి TOP NEWS!

@ జిల్లా వ్యాప్తంగా జోరుగా MLC ప్రచారం @ శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతున్న ఆలయాలు @ మెట్పల్లిలో పర్యటించిన మాజీ గవర్నర్ చిన్నమనేని విద్యాసాగర్ రావు @ రాజారాంపల్లిలో 12 ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు @ విత్తనాలు నాటిన వెల్గటూరు ఆదర్శ పాఠశాల విద్యార్థులు @ ఉమ్మడి మేడిపల్లి పట్టభద్రులతో ప్రభుత్వ విప్ ఆది సమావేశం @ ఇండిపెండెంట్ MLC అభ్యర్థికి రోడ్డు ప్రమాదంలో గాయాలు.. పరామర్శించిన మల్యాల ట్రస్మా సభ్యులు.
News February 24, 2025
శ్రీ సత్యసాయి జిల్లాలో TODAY TOP NEWS

➤ గ్రామాల వారీగా పాదయాత్ర: తోపుదుర్తి
➤ ధర్మవరం రైల్వే స్టేషన్‌లో తనిఖీలు
➤ చిల్లవారిపల్లి గ్రామస్థులకు డీఎస్పీ హెచ్చరిక
➤ డీహైడ్రేషన్‌తో లేపాక్షి యువకుడి మృతి
➤ పరిగి మండలంలో వైసీపీకి షాక్
➤ సత్యసాయి: HNSS ఫేస్-2 కాలువ మ్యాప్ పరిశీలన
➤ చెన్నేకొత్తపల్లిలో విషాదం.. చిన్నారి మృతి
➤ అనంతపురం: 6,463 మంది పరీక్షలు రాశారు
➤ బత్తలపల్లి: తంబాపురంలో అగ్ని ప్రమాదం
News February 23, 2025
‘భారత్ ఓడిపోతుంది’ అన్న ఐఐటీ బాబా ఎక్కడ?

పాక్ చేతిలో భారత్ ఓడిపోతుందని <<15548119>>జోస్యం చెప్పిన<<>> ఐఐటీ బాబా అలియాస్ అభయ్ సింగ్‌పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. Xలో #IITianBaba ట్రెండ్ అవుతోంది. ‘విరాట్.. ఇంకా చాలా మంది ఉన్నప్పటికీ ఎలా గెలుస్తారో చూద్దాం. అది జరిగి తీరదు’ అని నిన్న ఐఐటీ బాబా అనడంపై ఫైరవుతున్నారు. ‘ఇప్పుడు నీ జోస్యం ఏమైంది?’ అని నిలదీస్తున్నారు. వైరల్ అయ్యేందుకు సొంత దేశం ఓడిపోవాలని కోరుకోవడమేంటని మండిపడుతున్నారు.