News November 22, 2025

WNP: ఉచిత చీరల పంపిణీ సంతోషకరం: కలెక్టర్

image

ప్రతి ఒక్క మహిళకు ఉచిత చీర ఇవ్వడం చాలా సంతోషం కలిగిస్తుందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. వనపర్తి జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులందరికీ చీరలు పంపిణీ చేస్తామని, సంఘంలో లేనివారిని సైతం చేర్చుకొని ఇస్తామని తెలిపారు. మహిళా సంఘాల కోసం పెబ్బేరులో పెట్రోల్ బంక్, మహిళా సమాఖ్య భవనం త్వరలో పూర్తి కానున్నాయని ఆమె పేర్కొన్నారు.

Similar News

News November 23, 2025

HYD: వీకెండ్‌ పార్టీ.. రోడ్డెక్కితే దొరికిపోతారు!

image

వీకెండ్ వస్తే మందుబాబులు వైన్స్, బార్‌లు, పబ్‌లో చిల్ అవుతారు. తాగిన మత్తులో సెల్ఫ్ డ్రైవింగ్ ప్రమాదమని తెలిసినా కొందరు పట్టించుకోవడం లేదు. తాజాగా HYD పోలీసులు చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో వందల మంది పట్టుబడ్డారు. వాహనాలు సీజ్ అయ్యాయి. కౌన్సెలింగ్, కోర్టుకెళ్లి జరిమానా కట్టాల్సిన పరిస్థితి. D & D డేంజర్ అని పోలీసులు హెచ్చరిస్తున్నా వినకుండా తనిఖీల్లో దొరికి తలలు పట్టుకుంటున్నారు.

News November 23, 2025

పవన్ పర్యటనకు పటిష్ట భద్రత: కలెక్టర్

image

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం ద్వారకాతిరుమల మండలంలో పర్యటించనున్న నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. ఆదివారం ఆమె ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, జేసీ అభిషేక్ గౌడ్‌తో కలిసి ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పర్యటనలో ఎలాంటి లోపాలకు తావులేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణపై పోలీసులకు దిశానిర్దేశం చేశారు.

News November 23, 2025

రేపు ఘంటసాలలో ‘రైతన్నా మీ కోసం’

image

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని ఘంటసాల గ్రామంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో సోమవారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ప్రారంభించనున్నారు. టీడీపీ నేతలు ఆదివారం ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించారు. కనపర్తి శ్రీనివాసరావు శాస్త్రవేత్త డా.డి.సుధారాణితో మాట్లాడి ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు.