News October 13, 2025
WNP: కొత్త సర్పంచ్ల కోసం ఎదురుచూస్తున్న కార్యదర్శులు

పంచాయతీ కార్యదర్శులు కొత్త సర్పంచ్ల రాక కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 255 మంది సర్పంచుల పాలనాకాలం 18 నెలల క్రితమే ముగిసింది. నాటి నుంచి వీధిలైట్లు, పారిశుద్ధ్యం, తాగునీళ్లు తదితర పనులను కార్యదర్శులే చూస్తున్నారు. ఎన్నికలు జరగకపోవడంతో పంచాయతీలకు రాలేదు. నిర్వహణకు డబ్బు లేక ఇబ్బంది పడుతున్నామని, కొత్త సర్పంచులు వస్తే వారే చూసుకుంటారని ఎన్నికలకోసం ఎదురుచూస్తున్నామని కార్యదర్శులు పేర్కొంటున్నారు.
Similar News
News October 13, 2025
నోబెల్ పీస్ విన్నర్ పేరు ముందే లీకైందా?

ఈ ఏడాది నోబెల్ పీస్ ప్రైజ్ వెనిజులా అపోజిషన్ లీడర్ మరియా కొరినా మచాడోకు దక్కిన విషయం తెలిసిందే. ఆమె పేరు ముందే లీకైనట్లు కమిటీ అనుమానిస్తోంది. నోబెల్ ప్రకటనకు కొన్ని గంటల ముందు మరియా గెలుస్తారని బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లో 3.75% ఉన్న అంచనా 73%కి పెరిగిందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. గూఢచర్యం జరిగి ఉండవచ్చని నోబెల్ కమిటీ కార్యదర్శి క్రిస్టియన్ బెర్గ్ హార్ప్‌వికెన్ ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు.
News October 13, 2025
తెలంగాణ అప్డేట్స్

* బీసీ రిజర్వేషన్లపై నేడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం
* జూబ్లీహిల్స్ బై పోల్‌కు నేడు నోటిఫికేషన్
* బూత్‌లకు రాలేకపోయిన చిన్నారులకు ఇవాళ, రేపు ఇంటింటికి వెళ్లి పోలియో డ్రాప్స్ వేయనున్న వైద్య సిబ్బంది
* 2,620 మద్యం దుకాణాలకు 5,663 దరఖాస్తులు.. ఈ నెల 18తో ముగియనున్న గడువు
* గ్రూప్-1 అధికారులుగా నియమితులైన వారిలో 131 మందిని 26 జిల్లాలకు ఎంపీడీవోలుగా నియామకం
News October 13, 2025
ఉమెన్స్ వరల్డ్ కప్: 3 వికెట్లు తీసిన శ్రీ చరణి

ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్-2025లో కడప జిల్లా ఎర్రగుంట్లకు చెందిన నల్లపురెడ్డి శ్రీ చరణి రాణిస్తోంది. నిన్న వైజాగ్‌లో ఆస్ట్రేలియాతో ఆడిన మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసింది. 10 ఓవర్లలో 41 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టింది. ఇందులో ఒక మెయిడెన్ కూడా ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో ఇండియా 3 వికెట్ల తేడాతో ఓడిపోన విషయం తెలిసిందే. ఈ వరల్డ్ కప్‌లో మెత్తం 6 వికెట్లు తీసింది.