News February 12, 2025

WNP: చనిపోయేందుకు శ్రీశైలం వచ్చిన యువతి.. కాపాడిన పోలీసులు

image

ఆత్మహత్య చేసుకునేందుకు శ్రీశైలం వచ్చిన ఓ యువతిని స్థానిక పోలీసులు కాపాడారు. సీఐ ప్రసాదరావు వివరాల మేరకు.. వనపర్తి జిల్లా ఓ గ్రామానికి చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకునేందుకు శ్రీశైలం వచ్చింది. పాతాళగంగ వద్ద తిరుగుతున్న ఆమెను పోలీస్ సిబ్బంది గుర్తించి వివరాలు తెలుసుకున్నారు. వారి బంధువులకు క్షేమంగా అప్పగించామని సీఐ తెలిపారు. ఆత్మహత్య ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో తెలియరాలేదని ఆయన పేర్కొన్నారు.

Similar News

News February 27, 2026

కార్పొరేషన్ కమిషనర్ నుంచి HNK కలెక్టర్‌గా..!

image

2015లో ఏర్పాటైన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఇప్పటి వరకు 10 మంది కమిషనర్లు, ఐదుగురు ఇన్‌ఛార్జ్‌లు పని చేశారు. వీరిలో కలెక్టర్‌గా పదోన్నతి పొందిన అరుదైన అవకాశాన్ని ఇద్దరే సాధించారు. ముందుగా ప్రావీణ్య, తాజాగా చాహత్ బాజ్పాయ్. జిల్లా కలెక్టర్ బాధ్యతలతో పాటు GWMC అదనపు ఛార్జ్ కమిషనర్‌గా, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్‌ ఛైర్‌పర్సన్‌గా 3 కీలక పదవులు ఒకేసారి నిర్వహించాల్సి ఉంది.

News February 27, 2026

మహబూబాబాద్: ఫార్మర్ రిజిస్ట్రీ 60.10 శాతం

image

కేంద్ర ప్రభుత్వ రైతు సంక్షేమ పథకాల లబ్ధి పొందేందుకు ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవాలని మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి (డీఏవో) సరిత సూచించారు. ఈ నెల 28తో గడువు ముగుస్తున్న నేపథ్యంలో ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో మొత్తం 2,12,827 పాస్ బుక్కులు ఉండగా, ఇప్పటి వరకు 1,27,900 (60.10%) నమోదు పూర్తయ్యాయని తెలిపారు.

News February 27, 2026

మున్సిపాలిటీల్లో పన్ను వసూళ్ల ‘డెడ్ లైన్’.. 32 రోజులే గడువు

image

మున్సిపాలిటీల్లో పన్ను వసూలుకు గడువు ముంచుకొస్తోంది. ఫిబ్రవరి ముగుస్తుండగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 32 రోజుల గడువు మాత్రమే మిగిలిఉంది. అయినా జిల్లాలోని NLG, MLG, DVK, HLY, CTL CDR, NKL, నందికొండ మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వసూళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. JAN, FEBలో మున్సిపల్ ఎన్నికల హడావిడితోతో అధికారులు, సిబ్బంది పన్నుల వసూళ్లపై దృష్టి సారించలేకపోయారు. దీంతో బల్దియాల్లో బకాయిలు పేరుకుపోయాయి.