News March 4, 2025
WNP: జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ

శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా వనపర్తి జిల్లా వ్యాప్తంగా నెల రోజుల పాటు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. 30 పోలీస్ యాక్ట్ మార్చి1 నుంచి 31 వరకు అమల్లో ఉన్నందున జిల్లాలో పోలీసు అధికారుల అనుమతులు లేకుండా ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, ఫంక్షన్ హాల్లో కార్యక్రమాలు, బహిరంగ సభలు, ప్రజలు గుమిగూడి ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహించరాదని చెప్పారు.
Similar News
News March 4, 2025
నాలుగు వికెట్లు కోల్పోయిన ఆసీస్

సెమీఫైనల్-1లో ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. జడేజా వేసిన బంతిని ఇంగ్లిస్ కవర్స్ మీదుగా ఆడబోయి కోహ్లీకి ఈజీ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. అంతకుముందు లబుషేన్(29) జడేజా వేసిన బంతికి వికెట్ల ముందు దొరికిపోయారు. మరోవైపు స్మిత్(59) వేగంగా పరుగులు చేస్తున్నారు. 28 ఓవర్లకు ఆసీస్ స్కోర్ 146-4.
News March 4, 2025
శ్రీ సత్యసాయి జిల్లాలో 413 మంది గైర్హాజరు

శ్రీ సత్యసాయి జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర విద్యార్థులకు మంగళవారం ఇంగ్లీష్ పేపర్-1 పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు 413 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు ఇంటర్మీడియట్ విద్యాధికారి రఘునాథరెడ్డి తెలిపారు. జిల్లాలో 12,162 మంది విద్యార్థులకు గానూ 11,749 విద్యార్థులు హాజరయ్యారన్నారు. ఒకేషనల్ పరీక్షకు సంబంధించి 1,696 మంది విద్యార్థులకు గానూ 1,595 మంది హాజరయ్యారని పేర్కొన్నారు.
News March 4, 2025
మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

మార్చి 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో మహిళా దినోత్సవ వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, ఎస్పీ కంచి శ్రీనివాస రావులు అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లో మహిళా దినోత్సవ వారోత్సవాలపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వారోత్సవాల నిర్వహణ నోడల్ అధికారిగా ఐసీడీఎస్ పీడీ ఉమదేవిని నియమించారు.