News December 19, 2025

WNP: టీ-20 క్రికెట్ లీగ్.. వనపర్తి జట్టు రెడీ

image

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) ఆధ్వర్యంలో ఈనెల 22 నుంచి నిర్వహించే జి.వెంకటస్వామి మెమోరియల్ టీ-20 క్రికెట్ టోర్నమెంట్‌కు వనపర్తి క్రికెట్ జట్టును MDCA, HCA ఆధ్వర్యంలో ఇవాళ ఎంపికలు నిర్వహించారు. వనపర్తి జిల్లా వ్యాప్తంగా మొత్తం 50 మంది క్రీడాకారులు పాల్గొనగా.. 15 మంది ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోచ్‌లు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News December 20, 2025

RJY: ఆర్ట్స్ కాలేజీలో కామర్స్ బ్లాక్‌ను ప్రారంభించిన లోకేశ్

image

రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో పూర్వ విద్యార్థి, తిరుమల విద్యాసంస్థల ఛైర్మన్ నున్న తిరుమలరావు రూ.42లక్షల విరాళంతో నిర్మించిన ‘స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్’ బ్లాక్‌ను మంత్రి లోకేశ్ ప్రారంభించారు. అనంతరం తిరుమలరావు దాతృత్వాన్ని లోకేష్ కొనియాడారు. చదివిన విద్యాసంస్థలకు తిరిగి సహాయం చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి, అధికారులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

News December 20, 2025

విద్యార్థులందరికీ దంత పరీక్షలు: కలెక్టర్ పమేలా సత్పతి

image

కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులెవరూ దంత సమస్యలతో బాధపడకూడదని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కరీంనగర్ ప్రధాన ఆస్పత్రిలో విద్యార్థుల చికిత్స తీరును ఆమె పరిశీలించారు. ఇప్పటివరకు 12 వేల మందికి పరీక్షలు నిర్వహించి, 1500 మంది బాధితులను గుర్తించినట్లు తెలిపారు. ఈనెల 23లోగా తొలి విడత పూర్తి చేసి, జనవరి 1 నుండి రెండో విడత శిబిరాలు ప్రారంభించాలని వైద్యులకు సూచించారు.

News December 20, 2025

ఆ వాహనాలు ఎవరికోసమో….?

image

తిరుపతి డివిజన్‌లో డిసెంబర్‌ 20న సీజ్ చేసిన వాహనాల వేలం నిర్వహించనున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. ఈ వేలంలో మొత్తం 375 వాహనాలకు టెండర్లకు ఆహ్వానం ఇచ్చినా 305 వాహనాలకే టెండర్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. 70 వాహనాల వివరాలను రౌండప్ చేసి, వాటిని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో వేలంలో పాల్గొనే వారిలో తీవ్ర అయోమయం నెలకొంది. ఆ వాహనాలు ఎందుకు పక్కనబెట్టారనే విమర్శలు వస్తున్నాయి.