News January 1, 2026

WNP: త్వరలోనే ల్యాబ్ టెక్నీషియన్ల నియామక పత్రాలు- చిన్నారెడ్డి

image

రాష్ట్రంలోని ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల అభ్యర్థులు గురువారం హైదరాబాద్‌ ప్రజా భవన్‌లో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, ఇన్ఛార్జ్ డాక్టర్ చిన్నారెడ్డిని కలిశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలోపే తమకు నియామక పత్రాలు అందజేయాలని వినతిపత్రం అందజేశారు. అభ్యర్థుల సమస్యలను విన్న ఆయన తక్షణమే సీఎంఓ అధికారి శేషాద్రితో ఫోన్లో మాట్లాడారు. ఈ నెల 14వ తేదీన నియామక పత్రాలు అందజేసేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Similar News

News January 5, 2026

చైనాను గట్టి దెబ్బ కొట్టిన అమెరికా!

image

సోషలిస్ట్ దేశమైన వెనిజులాలో చైనా రూ.లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టింది. ఎనర్జీ నుంచి స్పేస్ వరకు కీలక భాగస్వామిగా ఉంటూ రూ.వేల కోట్లు అప్పుగా ఇచ్చింది. ద్రవ్యోల్బణంతో వెనిజులా వాటిని తీర్చలేని దుస్థితిలో ఉంటే తక్కువ ధరకే ఆయిల్ దిగుమతి చేసుకుంటూ లబ్ధి పొందుతోంది. తాజాగా యూఎస్ జోక్యంతో అక్కడ మదురో పాలన అంతమైంది. దీంతో వెనిజులాలో చైనా పెట్టుబడులు, ఆయిల్ దిగుమతులపై నీలినీడలు కమ్ముకున్నాయి.

News January 5, 2026

అర్జీలను సకాలంలో పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. సోమవారం బాపట్ల కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్‌లో ఆయన ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. అర్జీలను సంబంధిత అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జేసీ భావన, తదితర అధికారులు పాల్గొన్నారు.

News January 5, 2026

ఖమ్మం ఐటీ హబ్‌లో ఉచిత శిక్షణ

image

ఖమ్మం ఐటీ హబ్‌లో నిరుద్యోగ యువతకు వివిధ సాఫ్ట్‌వేర్ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రాంతీయ కేంద్ర మేనేజర్ అశోక్ తెలిపారు. జావా, పైథాన్, ఒరాకిల్ ఎస్‌క్యూఎల్, హెచ్‌టీఎంఎల్, సీఎస్‌ఎస్, బూట్‌స్ట్రాప్, జావా స్క్రిప్ట్ వంటి ప్రోగ్రామింగ్ భాషల్లో నైపుణ్యం కల్పిస్తామన్నారు. డిగ్రీ, ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ నెల 6 నుంచి 13వ తేదీ లోపు ఐటీ హబ్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.