News March 1, 2025
WNP: దివ్యాంగులందరూ యూడిఐడి కలిగి ఉండాలి: కలెక్టర్

దివ్యాంగులందరూ యూడిఐడి(యూనిక్ డిజేబుల్ ఐడి) కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శనివారం ఐడిఓసి సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న దివ్యాంగులకు అందరికీ యూడీఐడీ కలిగి ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అందుకు సంబంధించి జిల్లాలోని సంబంధిత అధికారులకు శిక్షణ ఇవ్వాలన్నారు.
Similar News
News March 2, 2025
మహబూబ్ నగర్ జిల్లా.. నేటి ముఖ్యంశాలు

✓మహబూబ్ నగర్ జిల్లాలో.. రంజాన్ నెల ఉపవాస దీక్షలు ప్రారంభం✓బాలానగర్ మండలం నందారంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం.✓దేవరకద్ర పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులకు గాయాలు. ✓మహబూబ్ నగర్ జిల్లాలో. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.✓ఈనెల 12 నుంచి 14 వరకు కందూర్ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. ✓మన్యంకొండలో పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి
News March 2, 2025
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ATC: CM

TG: రాష్ట్రంలోని ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్స్(ITI)లను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు(ATC)గా అప్‌గ్రేడ్ చేయడంపై CM రేవంత్ సమీక్షించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో తప్పనిసరిగా ఒక ATC ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ITIలు లేని కేంద్రాల్లో కొత్తగా ATCలను ఏర్పాటు చేయాలన్నారు. నియోజకవర్గ కేంద్రాలు/పట్టణాలకు సమీపంలో ATCలు ఉండేలా చూడాలని, అవసరమైన నిధులను అందిస్తామని చెప్పారు.
News March 1, 2025
ప్రతి నియోజకవర్గంలో ఓ మోడల్ స్కూల్: మంత్రి లోకేశ్

AP: <<14566229>>అపార్ ఐడీ<<>> ద్వారా KG- PG వరకు విద్యార్థుల పురోగతిని ట్రాక్ చేయాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో ఓ మోడల్ స్కూల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. PG ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలుకు విధివిధానాలు రూపొందించాలని, అమరావతిలో AI, స్పోర్ట్స్ వర్సిటీల పనులను వేగవంతం చేయాలని సూచించారు. వెల్ఫేర్ హాస్టళ్లలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు.