News February 10, 2025

WNP: నీటి గుంతలో పడి బాలుడి మృతి

image

నీటిగుంతలో పడి ఓ బాలుడు మృతిచెందిన ఘటన పాన్‌గల్ మండలం మాధవరావుపల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్థుల వివరాలిలా.. గ్రామానికి చెందిన నందిని, వినోద్‌ల కుమారుడు రుద్రరాజు(2) ఆదివారం పిల్లలతో కలిసి ఆడుకుంటుండగా.. పక్కనే ఉన్న నీటి గుంతలో పడిపోయాడు. చిన్నారిని వెంటనే బయటికి తీసి ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది. చిన్నారి మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

Similar News

News March 1, 2026

బాణసంచా కేంద్రాల్లో పోలీసుల తనిఖీలు

image

వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘటన నేపథ్యంలో అంబేడ్కర్ కోనసీమ జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో అటువంటి ఘటనలు జరగకూడదని ఎస్పీ రాహుల్ మీనా ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న బాణసంచా తయారీ, విక్రయ కేంద్రాల్లో పోలీసులు, అగ్నిమాపక, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో విస్తృత తనిఖీలు చేపట్టారు.

News March 1, 2026

కామరాజర్ పోర్టులో ఉద్యోగాలు

image

చెన్నైలోని<> కామరాజర్ పోర్టు<<>> 14 జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా డిగ్రీ, బీకామ్ అర్హత గలవారు మార్చి 28 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష(CBT), DV, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.25,250-రూ.50,500 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://kpl.cbtexam.in

News March 1, 2026

అనకాపల్లి: బాణసంచా తయారీ కేంద్రాలపై విస్తృతంగా తనిఖీలు

image

అనకాపల్లి జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రాలపై విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో ఘటన జరిగిన నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం ముందస్తు తనిఖీలు చేపట్టిందన్నారు. నర్సీపట్నం, పరవాడ డీఎస్పీల ఆధ్వర్యంలో రెవెన్యూ, ఫైర్, పోలీస్ శాఖలు సంయుక్తంగా అనధికారంగా నిర్వహిస్తున్న కేంద్రాలపై దాడులు చేసినట్లు పేర్కొన్నారు.