News February 10, 2025
WNP: నీటి గుంతలో పడి బాలుడి మృతి

నీటిగుంతలో పడి ఓ బాలుడు మృతిచెందిన ఘటన పాన్‌గల్ మండలం మాధవరావుపల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్థుల వివరాలిలా.. గ్రామానికి చెందిన నందిని, వినోద్‌ల కుమారుడు రుద్రరాజు(2) ఆదివారం పిల్లలతో కలిసి ఆడుకుంటుండగా.. పక్కనే ఉన్న నీటి గుంతలో పడిపోయాడు. చిన్నారిని వెంటనే బయటికి తీసి ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది. చిన్నారి మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
Similar News
News November 6, 2025
‘పోలీస్ శాఖపై గౌరవం పెరిగేలా విధులు నిర్వర్తించాలి’

జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో పదోన్నతి, బదిలీపై నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాల నుంచి బదిలీ అయిన 11 మంది హెడ్ కానిస్టేబుళ్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, పదోన్నతితో బాధ్యతలు పెరుగుతాయని అన్నారు. సేవా నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేసి ప్రజల్లో పోలీస్ శాఖపై నమ్మకం, గౌరవాన్ని పెంపొందించే విధంగా విధులు నిర్వహించాలని SP కోరారు.
News November 6, 2025
జగిత్యాల: ‘సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి’

జగిత్యాల జిల్లాలో సైబర్ నేరాలను నివారించేందుకు పోలీస్ శాఖ అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ఉదయం వాకింగ్‌కు వచ్చే ప్రజలను పోలీసులు కలిసి సైబర్ మోసాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆన్‌లైన్ బ్యాంకింగ్, షాపింగ్, సోషల్ మీడియా ఉపయోగంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానాస్పద లింకులు ఓపెన్ చేయొదని, బ్యాంక్ వివరాలు, OTPలు ఎవరితోనూ పంచుకోవద్దన్నారు. అనుమానం వస్తే 1930కి కాల్ చేయాలన్నారు.
News November 6, 2025
నకిలీ మద్యం కేసు.. విచారణలు 11కు వాయిదా

* AP నకిలీ మద్యం కేసులో జోగి రమేశ్, రాము బెయిల్ పిటిషన్లపై విచారణ ఈ నెల 11కు వాయిదా వేసిన విజయవాడ కోర్టు. వారిని 10 రోజులు కస్టడీకి ఇవ్వాలన్న ఎక్సైజ్ అధికారుల పిటిషన్లపై విచారణా అదే రోజుకు వాయిదా
* ఇదే కేసులో జనార్దన్ రావు, జగన్మోహన్ రావును 5 రోజుల కస్టడీకి కోరిన అధికారులు.. విచారణ 11వ తేదీకి వాయిదా
* ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో IPS సంజయ్ బెయిల్ పిటిషన్‌పై తదుపరి విచారణ ఈ నెల 10కి వాయిదా


