News January 27, 2025

WNP: ‘పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి’

image

ఫిబ్రవరి 3 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను వనపర్తి జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్ ఆదేశించారు. సోమవారం ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు, పర్యావరణ విద్య, నైతిక మానవ విలువల పరీక్షల నిర్వహణ పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు 41 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Similar News

News September 17, 2025

మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి: పవన్

image

AP: సమాజంలో వైషమ్యాలు సృష్టించే శక్తులు పేట్రేగిపోతున్నాయని కలెక్టర్లు, SPల సదస్సులో Dy.CM పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ‘సామాజిక వర్గాల మధ్య అంతరాలు సృష్టించే విద్రోహ శక్తుల పట్ల నిరంతర అప్రమత్తత అవసరం. CM చంద్రబాబు శాంతిభద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. మహిళల భద్రతకు ప్రాధాన్యమివ్వండి. సుగాలి ప్రీతి కేసుపై ప్రత్యేక శ్రద్ధ చూపండి. డ్రగ్స్ వ్యాప్తిపై ఉక్కుపాదం మోపాలి’ అని ఆదేశించారు.

News September 17, 2025

మేడారం గద్దెల చుట్టూ సాలహారం

image

మేడారం మాస్టర్ ప్లాన్‌లో భాగంగా నూతనంగా నిర్మించిన గద్దెల చుట్టూ గుడిని పోలిన సాలహారం నిర్మించనున్నారు. దీనిపై పూజారులు గుర్తించి ప్రతిపాదించిన వనదేవతల చరిత్ర, అమ్మవార్ల 700 రూపాలను చిత్రీకరించనున్నారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా చిత్రాలు రూపొందించనున్నారు.

News September 17, 2025

చరిత్రలో ఈ రోజు: సెప్టెంబర్ 17

image

✒ 1906: స్వాతంత్ర్య సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య జననం
✒ 1915: భారత చిత్రకారుడు MF హుస్సేన్ జననం
✒ 1929: భారతీయ కామిక్స్ సృష్టికర్త అనంత్ పాయ్ జననం
✒ 1943: రాజకీయ నాయకుడు, సినీ నిర్మాత టి.సుబ్బరామిరెడ్డి జననం
✒ 1950: ప్రధాని నరేంద్ర మోదీ(ఫొటోలో) జననం
✒ 1948: నిజాం పరిపాలన నుంచి హైదరాబాద్‌కు విముక్తి
✒ 1986: దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ జననం