News October 8, 2025
WNP: పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలి: ఎస్పీ

వనపర్తి జిల్లా ఎస్పీ గిరిధర్ మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో కోర్టు డ్యూటీ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. కోర్టు కేసుల్లో నిందితులకు శిక్షలు పడితేనే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని ఎస్పీ అన్నారు. కేసులు పెండింగ్‌లో లేకుండా త్వరగా పరిష్కరించి, నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
Similar News
News October 8, 2025
MHBD: హెడ్మాస్టర్‌కు పాముకాటు

పాఠశాలలో ఉపాధ్యాయురాలికి పాము కాటు వేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండలంలోని కొడిసెల మిట్ట ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ పి. సరితకు మంగళవారం మధ్యాహ్నం పాఠశాలలో పాము కాటు వేసింది. గమనించిన స్థానికులు చికిత్స కోసం వెంటనే గంగారం ప్రాథమిక వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని గ్రామస్థులు తెలిపారు.
News October 8, 2025
ప్రతి శనివారం టిడ్కో ఇళ్ల కేటాయింపు: మంత్రి

AP: 2026 జూన్ నాటికి టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లను ప్రతి శనివారం లబ్ధిదారులకు కేటాయించాలని సూచించారు. రాబోయే రెండేళ్లలో అమృత్ 2.0 స్కీమ్‌లో భాగంగా పట్టణాల్లో 90 శాతం ఇళ్లకు తాగునీరు అందించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని పేర్కొన్నారు. గడువులోగా సంబంధిత తాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయాలని సూచించారు.
News October 8, 2025
భక్తి ఉంటే చాలు.. శివుడే అడ్డంకుల్ని తొలగిస్తాడు!

భక్తి యోగం అన్ని మార్గాలకంటే అత్యంత శ్రేష్ఠమైనది. దీనికి సంపద, జ్ఞానమనే కఠిన నియమాలు అవసరం లేదు. నిష్కల్మషమైన భక్తి ఉంటే చాలు. అలాంటి భక్తులకు, భక్తవత్సలుడైన పరమేశ్వరుడే స్వయంగా అన్ని అడ్డుగోడలను, విఘ్నాలను తొలగిస్తాడు. ఏ కష్టమూ లేకుండా తత్వజ్ఞానం లభించేలా అనుగ్రహిస్తాడు. శివుని దయతోనే ముక్తి, బ్రహ్మజ్ఞానం సాధ్యమవుతాయి. మనల్ని రక్షించేది, భక్తి మార్గంలో నడిపించేది ఆ పరమ శివుడే! <<-se>>#Daivam<<>>