News October 23, 2025
WNP: ప్రజల నమ్మకం గెలిచేలా పోలీసులు పనిచేయాలి: ఎస్పీ

శాంతి భద్రతల పరిరక్షణే ప్రతి పోలీసు ప్రధాన ధ్యేయం కావాలని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోటలోని రామకృష్ణారెడ్డి గార్డెన్‌లో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో ఆయన నెలవారి నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజల నమ్మకాన్ని గెలుచుకునేలా ఉత్సాహంగా, నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News October 24, 2025
మైనారిటీ వృత్తి శిక్షణకు సంస్థల దరఖాస్తుల ఆహ్వానం

మైనారిటీలకు ఉద్యోగావకాశాలు కల్పించే వృత్తి నైపుణ్య శిక్షణా సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఖమ్మం జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఎం. ముజాహిద్ తెలిపారు. గవర్నమెంట్ నైపుణ్యాభివృద్ధి సంస్థలతో అనుసంధానమైన ట్రైనింగ్ పార్ట్‌నర్ సంస్థలు నవంబర్ 6 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అవసరమైన పత్రాలు, ఆడిట్ రిపోర్టులు జతపరచాలన్నారు.
News October 24, 2025
గెలుపు దిశగా భారత్

ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ కీలక మ్యాచులో భారత అమ్మాయిలు ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతున్నారు. 341 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ను 154 రన్స్‌కే 5 వికెట్లు తీసి దెబ్బకొట్టారు. రేణుకా ఠాకూర్ 2 వికెట్లు తీయగా క్రాంతి, స్నేహ, ప్రతీకా రావల్ తలో వికెట్ పడగొట్టారు. భారత్ విజయానికి మరో 5 వికెట్లు అవసరం. ఈ మ్యాచులో గెలిస్తే సెమీస్‌కు లైన్ క్లియర్ కానుంది.
News October 24, 2025
భూపాలపల్లి: 25న జాబ్ మేళా

ఈ నెల 25వ తేదీన భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఆరూరి శ్యామల తెలిపారు. ఓ ఫైనాన్స్ క్రెడిట్ ప్రవేట్ కంపెనీ లిమిటెడ్ నందు బ్రాంచ్ మేనేజర్, ఫీల్డ్ ఆఫీసర్ పోస్టులకు జాబ్ మేళా నిర్వహించనున్నామన్నారు. ఆసక్తి గల వారు సంబంధిత సర్టిఫికెట్లతో ఉదయం 11 గంటలకు హాజరై జాబ్ మేళాను సద్వినియోగం చేసుకువాలన్నారు.