News March 5, 2025

WNP: ప్రజావాణిలో దరఖాస్తులను స్వీకరించిన చిన్నారెడ్డి

image

హైదరాబాద్ మహాత్మ జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌లో నిర్వహించిన ప్రజావాణికి 401 దరఖాస్తులు రాగ, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల్ల చిన్నారెడ్డి దరఖాస్తులను స్వీకరించారు. గ్రామీణ అభివృద్ధి శాఖకు చెందినవి 60, రెవెన్యూ 38, ఇందిరమ్మ ఇండ్లకు 216, ఇతర దరఖాస్తులు 47 వచ్చాయి. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.

Similar News

News February 28, 2026

గుంటూరు: MRI స్కాన్‌కి వెళ్తే.. నెల రోజులు ఆగాల్సిందే..!

image

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని అనేక సమస్యలు వేధిస్తున్నాయి. ముఖ్యంగా C.T స్కాన్, MRI సేవలలో తీవ్రమైన రద్దీ నెలకొంది. ట్రామా వంటి అత్యవసర కేసుల్లో కీలకమైన MRI కోసం రోగులు 20–30 రోజుల వరకు వేచి ఉండాల్సి వస్తోంది. ఈ ఆలస్యం వల్ల ఆరోగ్య పరిస్థితి విషమించే ప్రమాదం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు తక్షణ చర్యలు తీసుకుని సేవలను మెరుగుపరచాలని కోరుతున్నారు.

News February 28, 2026

సిద్దిపేట: పడిపోయిన టమాటా ధర

image

సిద్దిపేటలోని రైతు బజార్లో గత వారంతో పోలిస్తే కూరగాయల ధరలు గణనీయంగా తగ్గాయి. వారం క్రితం కిలో రూ.20 వరకు పలికిన టమాట ధర ప్రస్తుతం రూ.8 పడిపోయింది. వంకాయ రూ.20, బెండకాయ రూ.34, మిర్చి రూ.40, కాకరకాయ రూ.40కి చేరుకుంది. బీరకాయ రూ.48, క్యాబేజీ రూ.15, దొండకాయ రూ.40 చొప్పున విక్రయిస్తున్నారు. క్యారెట్ రూ.24, ఆలుగడ్డ రూ.20, ఉల్లిగడ్డ రూ‌.20, చిక్కుడు రూ.44, అల్లం రూ.70, ఎల్లిగడ్డ రూ.140 చొప్పున ఉన్నాయి.

News February 28, 2026

GNT: ఒకప్పటి ద(ర్జీ)ర్జానే వేరయా..!

image

కార్యం ఏదైనా కుట్టిన దుస్తులు అంటే గుర్తొచ్చేది దర్జీ. కాల క్రమేణా ప్రజలు రెడీమేడ్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. దర్జీ కూలీ, రెడీమేడ్ దుస్తులు అటు, ఇటుగా ఒకటే అవుతుండటంతో అప్పటికప్పుడు దొరికే రెడీమేడ్ దుస్తులు కొంటున్నారు. ఒకప్పుడు దర్జీకి కొలతలు ఇవ్వడం‌, స్టిచ్చింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందా? అని ఎదురు చూడటం అంతా ఆసక్తిగా ఉండేది. నేడు టైలర్స్ డే ఈ సందర్భంగా వారితో మీకు ఉన్న అనుబంధం కామెంట్ చేయండి.