News January 8, 2026

WNP: బాల్ బ్యాడ్మింటన్ జిల్లా అధ్యక్షుడిగా మన్మోహన్ రావు

image

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వనపర్తికి చెందిన ప్రముఖ న్యాయవాది పి.మన్మోహన్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా పి.వెంకట్రాంరెడ్డి ఎన్నికయ్యారు. ముఖ్య అతిథిగా బాల్ బ్యాట్మెంటిన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ, పరిశీలకుడిగా సుమన్ హాజరయ్యారు. డిప్యూటీ ఎస్ ఓ.సుధీర్ రెడ్డి, క్రీడాకారులు భాస్కర్ గౌడ్,అలీమ్, చుక్క చంద్ర శేఖర్, నరేందర్ పాల్గొన్నారు.

Similar News

News February 5, 2026

కల్తీ నెయ్యి కేసు.. ఇవాళ సీఎంతో పవన్, మాధవ్ భేటీ!

image

AP: కల్తీ నెయ్యి వ్యవహరంపై సీఎం చంద్రబాబు నివాసంలో ఇవాళ కీలకం సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర చీఫ్ మాధవ్ భేటీ కానున్నట్లు సమాచారం. ఈ నెల 3న జరిగిన క్యాబినెట్ భేటీలో అసలు సూత్రధారులను పట్టుకునేందుకు విచారణ కమిషన్ ఏర్పాటుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది.

News February 5, 2026

తిరుమల లడ్డూ కల్తీ నిజమే: ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు

image

తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందన్న విషయం వాస్తవమేనని MLA విష్ణు కుమార్ రాజు అన్నారు. గతంలో లడ్డూ తీసుకొస్తే 10 రోజుల పాటు సువాసన వచ్చేదని, ఐదేళ్లుగా లడ్డూను చూస్తేనే కల్తీ అయిందని అర్థమవుతోందన్నారు. YCP పాలనలో కొందరు నేతలు దారుణంగా మాట్లాడారని, అందుకే ప్రజలు ఎన్నికల్లో గుణపాఠం చెప్పారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కేంద్రం పరిరక్షిస్తుందని
ఆయన స్పష్టం చేశారు.

News February 5, 2026

‘ధురంధర్’ సరికొత్త చరిత్ర!

image

ఆదిత్య ధర్, రణ్‌వీర్ సింగ్ కాంబినేషన్లో తెరకెక్కిన స్పై యాక్షన్ డ్రామా ‘ధురంధర్’ సరికొత్త చరిత్ర సృష్టించింది. టికెట్ బుకింగ్ యాప్ ‘బుక్ మై షో’లో అత్యధిక టికెట్లు అమ్ముడుపోయిన బాలీవుడ్ చిత్రంగా నిలిచిందని సినీ వర్గాలు తెలిపాయి. గత ఏడాది డిసెంబర్ 5న ఈ మూవీ విడుదలవ్వగా 1.3 కోట్ల టికెట్లు అమ్ముడుపోయాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఛావా(1.25 కోట్లు), జవాన్(1.24 కోట్లు), స్త్రీ2(1.11 కోట్లు) ఉన్నాయి.