News August 28, 2025
WNP: భూభారతి అర్జీల పరిష్కారంలో వేగం పెంచాలి: కలెక్టర్

భూభారతిలో పెండింగ్‌లో ఉన్న రైతు అర్జీలను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో మండల తహశీల్దార్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. మ్యుటేషన్, రిజిస్ట్రేషన్ దరఖాస్తులను ఆలస్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో విచారణ పూర్తి చేసిన వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News August 29, 2025
అర్హులకు పెన్షన్ అందించాలి: కలెక్టర్

జిల్లాలో అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందజేయాలని కలెక్టర్ వెంకట మురళి పేర్కొన్నారు. గురువారం అమరావతి సచివాలయంలోని సీఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయనంద్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాపట్ల కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం స్థానిక కలెక్టరేట్‌లో వీక్షణ సమావేశం నిర్వహించి అర్హులకు పెన్షన్లు అందించాలన్నారు.
News August 29, 2025
ప్రకాశం: డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్!

ప్రకాశం జిల్లాలో మెగా డీఎస్సీలో PHC కేటగిరి కింద ఎంపికైన అభ్యర్థులకు ఒంగోలు చెరువుకొమ్ముపాలెం వద్ద ఉన్న సరస్వతి జూనియర్ కళాశాలలో దరఖాస్తుల పరిశీలన నిర్వహిస్తామని డీఈఓ కిరణ్ కుమార్ తెలిపారు. వెరిఫికేషన్ చేయించుకున్న అభ్యర్థులు తమ దివ్యాంగత్వం ధ్రువీకరణ పత్రాలతో ఒంగోలు జీజీహెచ్, పీహెచ్సీహెచ్1 పత్రాలు కలిగిన విశాఖపట్నం ENT వైద్యశాలకు శుక్రవారం వెళ్లాలని కోరారు.
News August 29, 2025
తిరుపతి: 31న టెన్నికాయిట్ జట్ల ఎంపిక

తిరుపతి జిల్లా టెన్నికాయిట్ సీనియర్, జూనియర్, బాల, బాలికల జట్లు ఎంపిక ఈనెల 31న ఉదయం 9 గంటలకు నిర్వహిస్తామని ఆ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ బండి శ్యామసుందరరావు తెలిపారు. నాయుడుపేట జడ్పీ బాయ్స్ హైస్కూల్లో ఎంపికలు జరుగుతాయని చెప్పారు. జూనియర్ విభాగంలో తలపడే విద్యార్థులు 2007 జనవరి 1న, ఆ తర్వాత జన్మించిన వారై ఉండాలని సూచించారు.