News February 4, 2025
WNP: మరో రెండు రోజులే మిగిలింది..!

తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తు గడువు మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఫిబ్రవరి 1న చివరి తేది ఉండగా.. ప్రభుత్వం దరఖాస్తు చివరి తేదీని ఫిబ్రవరి 6 వరకు పొడిగించింది. ఇంకా ఎవరైనా దరఖాస్తు చేయనట్లయితే చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంబంధిత శాఖ నాగర్‌కర్నూల్ జిల్లా అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News November 15, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 15, శనివారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.06 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.21 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.55 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News November 15, 2025
MHBD: ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు: CI

విద్యార్థినిలతో అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్‌పై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి తెలిపారు. MHBD పట్టణం కంకర బోర్డులో గల జిల్లా పరిషత్ హైస్కూల్లో సోషల్ టీచర్‌గా పనిచేస్తున్న రవి అనే ఉపాధ్యాయుడు గత పదిరోజులుగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని బాధితురాలి తల్లితో చెప్పింది. దీంతో టీచర్‌పై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
News November 15, 2025
జగిత్యాల: గంజాయి కేసులో ముగ్గురికి 7 ఏళ్ల జైలు

జగిత్యాల పట్టణ పోలీస్ దర్యాప్తులో బయటపడ్డ గంజాయి పెంపకం, సరఫరా కేసులో ముగ్గురికి జిల్లా ఫస్ట్ అదనపు సెషన్స్ జడ్జి శ్రీ నారాయణ 7 ఏళ్ల జైలు శిక్ష, ఒక్కరికి రూ.10 వేల జరిమానా విధించారు. నిందితులు మేకల రాజు, సాయి, చందు 250 గ్రాముల గంజాయి వ్యాపారంలో ప్రమేయం ఉన్నట్లు నిర్ధారించారు. కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ అభినందించారు.


