News January 28, 2025
WNP: మీ పిల్లలు ఏ కళాశాలలో ఎక్కడ చదువుతున్నారు..?

ఉమ్మడి జిల్లాలో ఇంటర్ విద్యా శాఖలో పనిచేసే సిబ్బంది పిల్లలు ఇంటర్మీడియట్ ఎక్కడ చదువుతున్నారు అనే వివరాలను ఇంటర్ బోర్డ్ సేకరిస్తుంది. ఎక్కడ ఏ కళాశాలలో చదువుతున్నారు అనే సమాచారాన్ని పంపించాల్సిందిగా అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయని జిల్లా ఇంటర్ కార్యాలయం సిబ్బంది పేర్కొన్నారు. మార్చి 5 నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు జరగనున్న నేపథ్యంలో సమాచారం సేకరిస్తున్నట్టుగా అధికారులు తెలిపారు.
Similar News
News February 21, 2026
ఫిబ్రవరి 21: చరిత్రలో ఈరోజు

1894: శాస్త్రవేత్త శాంతి స్వరూప్ భట్నాగర్ జననం (ఫొటోలో)
1941: ఇన్సులిన్ సహ ఆవిష్కర్త ఫ్రెడరిక్ బాంటింగ్ మరణం
1961: భారత సంతతికి చెందిన అమెరికన్ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ జననం
1976: సినీ గాయకుడు విజయ ప్రకాశ్ జననం
1977: సినీ గాయకుడు రంజిత్ జననం
1988: నటి వేదిక జననం
2013: దిల్‌సుఖ్ నగర్‌లో బాంబు పేలుళ్లు.. 18 మంది మృతి
* అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
News February 21, 2026
పాక్‌లో ‘డెత్ స్క్వాడ్’.. 8 నెలల్లో 924 మంది హతం!

పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో నేర నియంత్రణ శాఖ(CCD) డెత్ స్క్వాడ్‌లా మారింది. 2025లో ఏర్పాటైన ఈ విభాగం ఏప్రిల్-డిసెంబర్ మధ్య ఏకంగా 670 ఎన్‌కౌంటర్లు చేసింది. పోలీసు కాల్పుల్లో 924 మంది చనిపోయారు. ఇద్దరు పోలీసులు చనిపోయారని రికార్డుల్లో పేర్కొన్నారు. పాక్ మానవ హక్కుల కమిషన్ ఈ వివరాలు వెల్లడించింది. 8 నెలల్లో సగటున రోజూ 2 కంటే ఎక్కువ ఎన్‌కౌంటర్లు నమోదయ్యాయని, ఒక్క లాహోర్‌లోనే 139 జరిగాయని చెప్పింది.
News February 21, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.


