News August 25, 2025

WNP: ముఖ చిత్ర గుర్తింపుతో పింఛన్లు పంపిణీ

image

వనపర్తి జిల్లాలో సామాజిక పింఛన్లు ఇక నుండి ముఖ చిత్ర గుర్తింపు ద్వారా ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ఇక నుంచి వెలి ముద్రల గుర్తింపు ఇబ్బంది లేకుండా ముఖ చిత్రం గుర్తింపు ద్వారా పోస్టాఫీసుల్లో పింఛన్లు ఇవ్వనున్నారు. దీనికోసం సోమవారం పోస్టాఫీస్ అధికారికి 74 ముఖ చిత్ర గుర్తింపు చేసే సెల్ ఫోన్లను కలెక్టర్ అందజేశారు. డీఆర్‌డీఓ, పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News August 26, 2025

కామారెడ్డి: పోస్ట్ మాస్టర్లకు కొత్త మొబైల్ ఫోన్లు పంపిణీ

image

కామారెడ్డి జిల్లాలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లకు కొత్త మొబైల్ ఫోన్లు, ఫింగర్ ప్రింట్ డివైజ్‌లను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సోమవారం అందజేశారు. కొత్త పరికరాలతో ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారా పెన్షన్లను పంపిణీ వేగవంతంగా చేయవచ్చని కలెక్టర్ తెలిపారు. ఒకవేళ ఫేస్ రికగ్నిషన్ పనిచేయకపోతే, మంత్ర డివైజ్ ద్వారా ఫింగర్ ప్రింట్ ఉపయోగించి పెన్షన్ పంపిణీ చేయవచ్చన్నారు.

News August 26, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (ఆగస్టు 26, మంగళవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.47 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.01 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.18 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.44 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.34 గంటలకు
✒ ఇష: రాత్రి 7.48 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News August 26, 2025

నేడు JNTUలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఇంటర్వ్యూలు

image

అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ (Adhoc-Contract-Base) పోస్టులకు ECE (4), CSE (3), సివిల్ (2), ఇంగ్లీష్ (1), ఫిజిక్స్ (1)కు నేడు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు వారి బయోడేటాతో హాజరుకావాలని తెలిపారు. ఈ ఇంటర్వ్యూలు కళాశాలలోని ప్రధాన భవనంలో గల కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించనున్నారు.