News December 12, 2025
WNP: రెండో విడత ఎన్నికల ప్రచారానికి నేటితో ముగింపు

వనపర్తి జిల్లాలో ఈనెల 14న రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఆయా మండలాల్లో ఈరోజు సాయంత్రం ఐదు గంటల తర్వాత ఎటువంటి ప్రచారం నిర్వహించడానికి అనుమతి లేదని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ఎన్నికలు జరిగే వనపర్తి, కొత్తకోట, మదనాపూర్, ఆత్మకూరు, అమరచింత 5 మండలాల పరిధిలో నేటి సాయంత్రం 5 గ. వరకు మాత్రమే అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముగించాలని స్పష్టం చేశారు
Similar News
News December 15, 2025
VKB: నేడు ప్రజావాణి రద్దు: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి రేపు రద్దు చేయడం జరిగిందని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. వికారాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నందున తాత్కాలికంగా రేపటి సోమవారం ప్రజావాణి రద్దు చేయడం జరిగిందని తెలిపారు. యధావిధిగా మళ్లీ ప్రతి సోమవారం ఎన్నికల తర్వాత నిర్వహిస్తామని తెలిపారు.
News December 15, 2025
నిర్మల్: 68 సీట్లు కైవసం చేసుకున్న కాంగ్రెస్

మొదటి, రెండవ విడతలో పంచాయతీ ఎన్నికల్లో నిర్మల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ 68 సర్పంచ్ సీట్లు కైవసం చేసుకుంది. ప్రజలు అధికార పార్టీకే మొగ్గు చూపుతున్నారు. ఈ మేరకు జిల్లాలో కాంగ్రెస్ హావా కనిపిస్తోంది. జిల్లాలో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.