News October 29, 2025

WNP: రోగులకు మెరుగైన చికిత్స అందించాలి- కలెక్టర్

image

జిల్లాలో వర్ష ప్రభావం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఆస్పత్రికి వచ్చే రోగులకు డెంగీ పరీక్షలు కొనసాగించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం గోపాల్‌పేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించి, అటెండెన్స్ వివరాలను తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.

Similar News

News October 29, 2025

ప్రెగ్నెన్సీలో సూక్ష్మపోషకాలు తీసుకుంటున్నారా?

image

ప్రెగ్నెన్సీలో అదనపు పోషకాలు తీసుకోవడం తప్పనిసరి. ఇవే బిడ్డ శారీరక, మానసిక పెరుగుదల, రోగనిరోధకశక్తిని ప్రభావితం చేస్తాయంటున్నారు నిపుణులు. ప్రెగ్నెన్సీ తొలి 28రోజుల్లో తీసుకునే ఫోలిక్‌ ఆమ్లం బిడ్డలో నాడీలోపాలు రాకుండా చేస్తుంది. రక్తకణాల నిర్మాణానికి ఐరన్, దంతాలు, ఎముకల నిర్మాణానికి విటమిన్‌ D, కాల్షియం అవసరం. విటమిన్‌ A, అయొడిన్‌ శిశువు మెదడు, శారీరక పెరుగుదలకి తోడ్పడతాయని నిపుణులు చెబుతున్నారు.

News October 29, 2025

NZB: బాలికపై అఘాయిత్యం.. కోర్టు సంచలన తీర్పు

image

మైనర్ బాలికపై అత్యాచార కేసులో కామారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. మాచారెడ్డి పీఎస్ పరిధిలో దాడికి పాల్పడిన నిందితుడు భూక్యా గణేశ్‌కు జిల్లా జడ్జి CH VRR వర ప్రసాద్ యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.30 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. విదేశాలకు పారిపోయినా నిందితుడు చట్టం నుంచి తప్పించుకోలేడని ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. పోలీసు అధికారులు, దర్యాప్తు బృందాన్ని ఎస్పీ అభినందించారు.

News October 29, 2025

కోనసీమ: రేపు యథావిధిగా పాఠశాలలు

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అన్ని యాజమాన్య పాఠశాలలు గురువారం యథావిధిగా పనిచేస్తాయని DEO షేక్ సలీం బాషా బుధవారం స్పష్టం చేశారు. ఉప విద్యాశాఖ అధికారులు, ఎంఈవోలు, హెచ్ఎంలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. 10వ తరగతి విద్యార్థుల 100 రోజుల యాక్షన్ ప్లాన్ మీద దృష్టి సారించాలన్నారు. తుఫాన్ నేపథ్యంలో బుధవారం వరకు సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే.