News August 14, 2025

WNP: లైసెన్స్ సర్వేయర్ల శిక్షణ-అదనపు కలెక్టర్

image

రెండో విడత లైసెన్స్ సర్వేయర్ శిక్షణ కోసం జిల్లాలో 98 మందిని ఎంపిక చేసినట్లు వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ తెలిపారు. ఈనెల 18 నుంచి 50 రోజులపాటు తెలంగాణ అకాడమీ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 98490 81489 సంప్రదించాలన్నారు.

Similar News

News August 14, 2025

మంచిర్యాల: పంచాయతీ అధికారులతో డీపీఓ సమీక్ష

image

జిల్లా పంచాయతీ అధికారి డి.వెంకటేశ్వర్ రావ్ డివిజనల్ పంచాయతీ అధికారులు, మండల పంచాయతీ అధికారులతో ఈరోజు సమీక్షించారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై అధికారులతో చర్చించారు. క్షేత్ర స్థాయి అధికారుల తనిఖీలు, పంచాయతీ కార్యదర్శుల అటెండెన్స్, పౌర సేవలు, గ్రామాల్లో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను సమీక్షించాలన్నారు.

News August 14, 2025

వరంగల్: పునరావాస కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

image

భారీ వర్షాల ప్రభావంతో పోతన రోడ్‌లోని మరాఠీ భవన్‌లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని కలెక్టర్ డా.సత్య శారద సందర్శించారు. ఎన్టీఆర్ నగర్, సంతోషిమాత కాలనీ, బృందావన్ కాలనీ నిర్వాసితుల కోసం అందిస్తున్న తాగునీరు, ఆహారం, వైద్యసదుపాయాలు, వసతులను పరిశీలించారు. భోజన నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆమె, మరో రెండు రోజులు వర్షాలు ఉన్నందున పలు సూచనలు చేశారు.

News August 14, 2025

మంచిర్యాల: సెప్టెంబర్‌లో రాష్ట్ర స్థాయి గో విజ్ఞాన పరీక్షలు

image

సెప్టెంబర్‌లో నిర్వహించే రాష్ట్ర స్థాయి గో విజ్ఞాన పరీక్షల్లో విద్యార్థులు పాల్గొనే అవకాశం కల్పించాలని కోరుతూ గురువారం రాష్ట్రీయ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మంచిర్యాల డీఈఓ యాదయ్యకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం పరిషత్ రాష్ట్ర లీగల్ అడ్వైజర్ కొట్టే నటేశ్వర్, బీజేపీ నాయకుడు కిషోర్ మాట్లాడుతూ.. ఈ పరీక్షల్లో విజేతలకు ప్రథమ రూ.లక్ష, ద్వితీయ రూ.50 వేలు, తృతీయ బహుమతి రూ.25 వేలు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.