News February 4, 2025

WNP: విద్యార్థిని సన్మానించిన వనపర్తి జిల్లా ఎస్పీ

image

చిన్నంబావి మండలం కొప్పునూరు గ్రామానికి చెందిన పసుల శంకర్ యాదవ్ కుమారుడు మనోహర్ బీఎ డిగ్రీ పూర్తి చేసి వనపర్తి జిల్లా కేంద్రంలో ఎస్‌డీఎం లా కాలేజీలో చదువుతూ మొదటి సంవత్సరం సెమిస్టర్‌లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లోనే మొదటి ర్యాంకు సాధించాడు. ఈ సందర్భంగా మనోహర్‌ను వనపర్తి ఎస్పీ రావుల గిరిధర్, కళాశాల అధ్యాపకులు, కొప్పునూరు గ్రామస్థులు ఘనంగా సన్మానించారు.

Similar News

News September 16, 2025

ప్రొద్దుటూరు చరిత్రలోనే కాస్ట్లీ ఎగ్జిబిషన్ ఇదే!.

image

ప్రొద్దుటూరు చరిత్రలోనే కాస్ట్లీ ఎగ్జిబిషన్‌తో మున్సిపాలిటీకి రూ.1,91,44,00లు, ఆర్థిక శాఖకు జీఎస్టీ రూపంలో రూ.34,45,920లు ఆదాయం లభించనుంది. మొత్తంగా ప్రభుత్వానికి రూ.2,25,89,920లు ఆదాయం సమకూరుతుంది. దసరా ఉత్సవాల్లో రెండవ మైసూరుగా పేరుగాంచిన ప్రొద్దుటూరులో ప్రతి దసరా సమయంలోనూ మున్సిపల్ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. దీనివల్ల మున్సిపాలిటీకి, జీఎస్టీ శాఖకు ఆదాయం లభిస్తోంది.

News September 16, 2025

కర్నూలు జిల్లాలో 88 టీచర్ పోస్టులు మిగిలిపోయాయి..!

image

మెగా డీఎస్సీకి అర్హత గల అభ్యర్థులు లేకపోవడంతో కర్నూలు జిల్లా వ్యాప్తంగా 88 టీచర్ పోస్టులు మిగిలిపోయాయని DEO శామ్యూల్ పాల్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో 64, మున్సిపల్ కార్పొరేషన్ 7, మున్సిపాలిటీ పరిధిలో 12, ట్రైబల్ /చెంచుల విభాగంలో 5 ఐదు పోస్టులు భర్తీకి నోచుకోలేదన్నారు. టీచర్ పోస్టుల భర్తీ తుది జాబితా https://www.deokrnl13.blogspot.comలో అందుబాటులో ఉంచామన్నారు

News September 16, 2025

ప్రకాశం: రాక్సీ వచ్చేసింది.. గంజా నేరగాళ్లకు ఇక చుక్కలే.!

image

నేరాల నియంత్రణలో పోలీస్ జాగిలాలు నిర్వహించే విధులను అభినందించాల్సిందే. అలాంటి చురుకైన జాగిలం రాక్సీ ప్రకాశం పోలీసుల చెంతకు చేరింది. ప్రత్యేక శిక్షణతో గంజాయిని వాసనతో పసిగట్టడం దీని ప్రత్యేకత. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు రాక్సీని పోలీసులు రంగంలోకి దించారు. తొలి ప్రయత్నంలోనే గంజా ముఠా ఆటకట్టించింది. <<17720866>>సోమవారం పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో<<>> రాక్సీ సైలెంట్‌గా గంజాయి బ్యాగులను గుర్తించింది.