News February 1, 2025

WNP: వృద్ధుల సంక్షేమానికి కృషి: జిల్లా కలెక్టర్

image

వృద్ధుల సంక్షేమానికి అనేక చట్టాలు ఉన్నాయని, వాటిపై వృద్ధులకు అవగాహన కల్పించి, తగిన న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని వనపర్తి జిల్లా కలెక్టర్‌ ఆదర్శ్ సురభి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని ఎన్ఐసి వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సీనియర్‌ సిటిజన్స్‌ కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. సంక్షేమ చట్టం 2007 ద్వారా వృద్ధులకు న్యాయం చేస్తామని అన్నారు.

Similar News

News November 6, 2025

పున్నమి వెలుగుల్లో ధర్మపురి బ్రహ్మపుష్కరిణి

image

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని బ్రహ్మపుష్కరిణి(కోనేరు) కార్తీక పౌర్ణమి వెలుగుల్లో కళకళలాడింది. పున్నమి చంద్రుడి కాంతులు నిర్మల జలాలపై ప్రతిబింబించి దివ్య రూపాన్ని సాక్షాత్కరించింది. కార్తీక పౌర్ణమి కావడంతో చంద్రుడు మరింత ప్రకాశవంతంగా వెలిగి భక్తుల మనసులను ఆకట్టుకున్నాడు. దీపాల కాంతులు, చంద్రుని తేజస్సుల కలయికగా కోనేరు పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి.

News November 6, 2025

దోమకొండలో రేపు జిల్లా విలువిద్య పోటీలు

image

దోమకొండలోని గడి కోటలో శుక్రవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా విలువిద్య పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విలువిద్య అసోసియేషన్ అధ్యక్షుడు తిరుమల గౌడ్ తెలిపారు. పోటీలలో పాల్గొనే క్రీడాకారులు ఉదయం 8 గంటల వరకు గండికోటలోకి రావాలని సూచించారు. ముందుగా పేరు నమోదు చేసుకున్న వారికి పోటీలలో పాల్గొనే అవకాశం కల్పిస్తామన్నారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News November 6, 2025

యాదాద్రి: తెగిపడిన విద్యుత్ వైర్లు.. వృద్ధుడు, గేదె మృతి

image

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గేదెల కాపరి గొర్ల మల్లయ్య(55) రోజూ మాదిరిగానే తన గేదెలను మేపడానికి వెళ్లారు. అక్కడ ఓ వ్యవసాయ భూమిలో తెగి నేలపై పడిన కరెంటు వైర్లను గమనించకుండా, మేస్తున్న తన గేదెను పక్కకు కొట్టే ప్రయత్నంలో మల్లయ్యకు షాక్ తగిలింది. ఈ ఘటనలో మల్లయ్య, ఆయన గేదె అక్కడికక్కడే మృతి చెందారు.