News February 11, 2025
WNP: స్థానిక ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో: కలెక్టర్

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ల ద్వారా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు.ఎన్నికల నిర్వహణ సన్నద్ధతలో భాగంగా సోమవారం నిర్వహించిన మండలస్థాయి మాస్టర్ ట్రైనర్ లకు జిల్లాస్థాయి ట్రైనింగ్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. బ్యాలెట్ బాక్స్ తెరిచే విధానం,సీల్ వేసే విధానం తదితర అంశాలపై అవగాహన కల్పించుకోవాలన్నారు.
Similar News
News December 15, 2025
సర్పంచ్ రిజల్ట్స్.. ‘టాస్’తో గెలిచారు

TG: రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో పలు చోట్ల అభ్యర్థులకు ఓట్లు సమానంగా వచ్చాయి. నల్గొండలోని మంగాపురంలో ఉపేంద్రమ్మకు, మౌనికకు సమానంగా ఓట్లు రాగా టాస్ వేయడంతో ఉపేంద్రమ్మకు పదవి వరించింది. కామారెడ్డిలోని ఎల్లారెడ్డిలో సంతోశ్, మానయ్యకు 483 ఓట్ల చొప్పున పోల్ అవ్వగా టాస్ వేసిన అధికారులు సంతోశ్‌ను విజేతగా ప్రకటించారు. మరికొన్ని చోట్ల ఓట్లు సమానంగా రావడంతో అధికారులు డ్రా తీసి విజేతలను నిర్ణయించారు.
News December 15, 2025
నేడు సర్వ ఏకాదశి.. మోక్షం కోసం ఏం చేయాలంటే?

మార్గశిర కృష్ణ పక్ష ఏకాదశినే సర్వ ఏకాదశి అంటారు. ఈ రోజున విష్ణువును ఆరాధించాలని పండితులు సూచిస్తున్నారు. తద్వారా మోక్షం లభిస్తుందని చెబుతున్నారు. ‘దానాలు చేయడం వల్ల ఆత్మ శుద్ధి జరుగుతుంది. చేసే పనుల పట్ల ఏకాగ్రత పెరుగుతుంది. తృణధాన్యాలు తీసుకోకుండా ఉపవాసం పాటించాలి. విష్ణు సహస్రనామం పఠించాలి. వ్రతాలు ఆచరించడం మరింత శ్రేయస్కరం. మనస్ఫూర్తితో విష్ణుమూర్తిని ఆరాధిస్తే ముక్తి లభిస్తుంది’ అంటున్నారు.
News December 15, 2025
మిరుదొడ్డి: గొర్రెల కాపరి నుంచి ఉపసర్పంచిగా..

సామాన్యుడు అసామాన్యుడిగా ఎదిగిన వైనం ఇది. రెండో విడత స్థానిక ఎన్నికల్లో గొర్రెల కాపరిగా జీవనం సాగించిన పెద్ద కురుమ కరుణాకర్ మిరుదొడ్డి మేజర్ గ్రామపంచాయతీకి ఉపసర్పంచిగా ఎన్నికయ్యారు. 7వ వార్డు నుంచి అధిక మెజార్టీతో గెలుపొందిన ఆయన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు అండగా ఉండి, సేవ చేస్తానని భరోసా ఇచ్చారు. సాధారణ నేపథ్యం నుంచి ప్రజాప్రతినిధిగా ఎదిగిన కరుణాకర్ ప్రశంసలు అందుకుంటున్నారు.


