News March 4, 2025
WNP: జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ

శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా వనపర్తి జిల్లా వ్యాప్తంగా నెల రోజుల పాటు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. 30 పోలీస్ యాక్ట్ మార్చి1 నుంచి 31 వరకు అమల్లో ఉన్నందున జిల్లాలో పోలీసు అధికారుల అనుమతులు లేకుండా ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, ఫంక్షన్ హాల్లో కార్యక్రమాలు, బహిరంగ సభలు, ప్రజలు గుమిగూడి ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహించరాదని చెప్పారు.
Similar News
News March 4, 2025
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: DMHO

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని బాపట్ల DMHO డాక్టర్ విజయమ్మ వైద్య సిబ్బందికి సూచించారు. మంగళవారం అద్దంకి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను DMHO సందర్శించారు. వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లతో సమావేశం నిర్వహించి, సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సలహాలు ఇచ్చారు.
News March 4, 2025
యువత ఆకాంక్షలు నెరవేర్చాలి: మంత్రి లోకేశ్

AP: పట్టభద్రుల MLC ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆలపాటి రాజేంద్ర, పేరాబత్తుల రాజశేఖర్ మంగళగిరిలోని TDP ఆఫీసులో మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. వారికి అభినందనలు తెలిపిన మంత్రి మాట్లాడారు. ‘ఈ విజయంతో మనపై మరింత బాధ్యత పెరిగింది. యువత మనపై పెట్టుకున్న ఆశలను నెరవేర్చే దిశగా చిత్తశుద్ధితో పని చేయాలి. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని లోకేశ్ అన్నారు.
News March 4, 2025
కోనసీమ: MLCగా గెలిచిన రాజశేఖరం నేపథ్యం ఇదే..!

ఉభయగోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలుపొందిన పేరాబత్తుల రాజశేఖరం స్వగ్రామం కోనసీమ జిల్లాలోని జి.వేమవరం. తొలుత ఆయన కాంగ్రెస్ ఎంపీటీసీగా, అనంతరం టీడీపీ నుంచి ఎంపీపీ, జడ్పీటీసీగా పనిచేశారు. ఆక్వా వ్యాపారం చేసే రాజశేఖరం ప్రస్తుతం కాకినాడలో నివాసం ఉంటున్నారు. డిగ్రీ పూర్తిచేశారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్న రాజశేఖరానికి ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి వరించింది.