News March 1, 2025

WNP: దివ్యాంగులందరూ యూడిఐడి కలిగి ఉండాలి: కలెక్టర్

image

దివ్యాంగులందరూ యూడిఐడి(యూనిక్ డిజేబుల్ ఐడి) కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శనివారం ఐడిఓసి సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న దివ్యాంగులకు అందరికీ యూడీఐడీ కలిగి ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అందుకు సంబంధించి జిల్లాలోని సంబంధిత అధికారులకు శిక్షణ ఇవ్వాలన్నారు.

Similar News

News March 3, 2025

జిల్లాలో మావోయిస్టు కదలికలు లేవు: ములుగు SP

image

ములుగు జిల్లాలో మావోయిస్టుల కదలికలు పూర్తిగా అంతరించిపోయాయని SP శబరిశ్ స్పష్టం చేశారు. ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని 25 ఏళ్ల తర్వాత ఏటూరునాగారం పోలీస్ స్టేషన్ ముందు జాతీయ రహదారికి అడ్డుగా ఉన్న గేట్లు తెరిచి వాహనాల రాకపోకలకు అనుమతి కల్పించామన్నారు. 2001లో పీపుల్స్ వార్ సభ్యులు ట్రాక్టర్లలో మందుపాతరలు అమర్చి స్టేషన్ పేల్చివేశారని, అయితే ప్రస్తుతం జిల్లాలో వారి కార్యకలాపాలు లేవన్నారు.

News March 3, 2025

ఈ రోజు నమాజ్ వేళలు

image

మార్చి 3, సోమవారం
ఫజర్: తెల్లవారుజామున 5.21 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.33 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.28 గంటలకు
అసర్: సాయంత్రం 4.45 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.23 గంటలకు
ఇష: రాత్రి 7.35 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News March 3, 2025

గంగవరం: ప్రేమ పేరుతో మోసం.. పోలీసులకు ఫిర్యాదు

image

ప్రేమ పేరుతో యువకుడు మోసం చేశాడని గంగారం మండలం జంగాలపల్లికి చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. SI రవి కుమార్ వివరాలు.. కొత్తగూడ మండలం వేలుబెల్లికి చెందిన ఓ యువకుడు ప్రేమ పేరుతో ఆమెతో సహజీవనం చేసి ఇప్పుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నట్లు సదరు మహిళ ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SI వెల్లడించారు.

error: Content is protected !!