News April 6, 2024

WNPT: క్షుద్రపూజల పేరుతో రూ.9.73 లక్షలు టోకరా

image

క్షుద్రపూజలు చేసి నయం చేస్తామని రూ.9.73లక్షలు తీసుకుని మోసం చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. CI నాగభూషణరావు వివరాలు.. వనపర్తి జిల్లా గోపాల్‌వేటకు చెందిన సుద్దుల రాజు కొడుకు వెంకటేశ్(14)కు మతిస్తిమితం సరిగా లేదు. జ్యోతిష్యాలయం పేరుతో నయం చేస్తామని నమ్మించి మోసం చేసిన APలోని గుంటూరుకు చెందిన పరబ్రహ్మం, వెంకన్న, గోపిను అరెస్ట్ చేసి ఫోన్లు, రూ.7లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

Similar News

News January 7, 2026

MBNR: సంక్రాంతి పండుగ.. NH-43 పై నిఘా..!

image

సంక్రాంతి పండగ సందర్భంగా రాష్ట్ర రాజధాని సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికుల రాకపోకలు అధికంగా ఉండనున్న నేపథ్యంలో మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి నేషనల్ హైవే–44 పరిధిలోని బాలానగర్ ఫ్లైఓవర్ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా బాలానగర్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కొనసాగుతున్న కారణంగా ప్రయాణికులకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.

News January 7, 2026

MBNR: పీఎంశ్రీ క్రీడా పోటీలు.. విజేతలు వీరే!

image

మహబూబ్ నగర్ జిల్లాలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు ఘనంగా నిర్వహించారు. వివరాలు ఇలా!!
✒ కబడ్డీ (బాలుర)
1st- బాదేపల్లి, 2nd- గార్లపాడు
✒ కబడ్డీ (బాలికల)
1st- బాలానగర్, 2nd- వాపుల
✒ వాలీబాల్ (బాలుర)
విజేత- బాదేపల్లి, రన్నర్‌గా- వేముల
✒ వాలీబాల్ (బాలికల)
విజేత- బాలానగర్ (గురుకుల), రన్నర్‌గా-సీసీ కుంట(KGBV)

News January 7, 2026

MBNR: T20 లీగ్.. పాలమూరు విజయం

image

HCA ఆధ్వర్యంలో నిర్వహించిన ‘T20 కాకా స్మారక క్రికెట్ లీగ్’లో పాలమూరు ఘన విజయం సాధించింది. సిద్దిపేటలో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన WGL జట్టు 20 ఓవర్లలో 142/7 పరుగులు చేసింది. MBNR జట్టు 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. MBNR జట్టు ఆటగాడు అబ్దుల్ రాఫె-79* పరుగులు చేసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గా నిలిచాడు. వారిని MDCA ప్రధాన కార్యదర్శి రాజశేఖ్, కోచ్‌లు అభినందించారు.